విశాఖలో జొన్నవిత్తుల ‘ఉత్తరాంధ్ర శతకం’ ఆవిష్కరణ

ప్రముఖ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన ‘ఉత్తరాంధ్ర శతకం’ ఆవిష్కరణ వేడుక విశాఖలో ఘనంగా జరిగింది.

Published : 26 Apr 2022 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన ‘ఉత్తరాంధ్ర శతకం’ ఆవిష్కరణ వేడుక విశాఖలో ఘనంగా జరిగింది. తానా మాజీ అధ్యక్షుడు, తానా విశ్వసాహితీ వేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జొన్నవిత్తుల రచించిన పది శతకాలను ప్రచురణ చేసిన తెలుగు రాష్ట్రాల్లో సభలు నిర్వహించాలని అమెరికాలోని తెలుగు భాషాభిమానులు నిర్ణయించారు. 

దీనిలో భాగంగా ఈనెల 24న విశాఖలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జొన్నవిత్తుల స్వదస్తూరితో రాసిన 108 పద్యాల రాతప్రతిని విశాఖ తీరంలో సముద్రునికి సమర్పించారు. అనంతరం నగరంలోని కళాభారతి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర శతకాన్ని ఆవిష్కరించారు. దీనిలోని కొన్ని పద్యాలను జొన్నవిత్తుల ఆలపించి సభికుల్ని ఆనందింపజేశారు. 

ఈ కార్యక్రమంలో ఏయూ విశ్రాంత ఆచార్యులు వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ శాస్త్రవేత్త, రచయిత డా.కలశపూడి శ్రీనివాసరావు, విజయ్‌ నిర్మాణ్‌ కంపెనీ అధినేత సూరపనేని విజయ్‌కుమార్‌, పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణ ప్రసాద్‌, తెలుగుదండు వ్యవస్థాపకులు పరవస్తు ఫణిశయన సూరి, తెలుగు భాషావేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెనాలి డబుల్‌ హార్స్‌ మినపగుండ్లు సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని