సింగపూర్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన తెలుగు సంఘాల ప్రతినిధులు

భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ మీడియేషన్‌ సెంటర్‌ ప్యానల్‌ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అక్కడి ప్రవాసాంధ్రులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Published : 01 Sep 2023 20:05 IST

సింగపూర్‌: భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ మీడియేషన్‌ సెంటర్‌ ప్యానల్‌ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అక్కడి ప్రవాసాంధ్రులు ఆయనకు అభినందనలు తెలిపారు. తెలుగు సంస్థలైన శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ తదితర సంస్థల ప్రతినిధులు ఆయన్ను కలిసి తమ సంస్థల తరఫున అభినందనలు చేసి సన్మానించారు.  “తెలుగువారికి గర్వకారణమైన జస్టిస్ ఎన్వీ రమణ సింగపూర్‌ పర్యటనకు రాగా ఆయన్ను కలుసుకున్నాం. మా సంస్థ గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించాం. ఆయన ఆశీస్సులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అని శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షుడు కవుటూరి రత్నకుమార్‌ అన్నారు. 

ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తెలుగు వారంతా ఒక్కటిగా ఒకే మాటపై, ఏకతాటిపై ఉంటే తెలుగు భాషను సింగపూర్‌ ప్రభుత్వం కూడా గుర్తిస్తుందన్నారు. మీరంతా ఎన్నో ఏళ్లు నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరమవుతుందని చెప్పారు. ఆ ప్రక్రియలో తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి తదితరులు ఆయన్ను సన్మానించారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు