Justice N.V.Ramana: ప్రజాస్వామ్యం పరాజయం పాలవుతోంది: జస్టిస్ ఎన్.వి.రమణ
రాజకీయాల్లో వికృతాలు చూస్తున్నామని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఫిలడెల్ఫియాలో నిర్వహిస్తున్న 23వ తానా సభల్లో ఆయన ప్రసంగించారు.
ఫిలడెల్ఫియా: ప్రస్తుత రాజకీయాలపై సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వికృత ఘటనలు చూస్తున్నామని అన్నారు. పార్టీల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో జరుగుతున్న 23వ తానా మహాసభల్లో జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగించారు ‘‘ ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలెలా నడుపుతారు?రాజకీయాల్లో ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి. సోషల్ మీడియాలో స్త్రీలను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారు. అభూతకల్పనలతో అభాసుపాలు చేస్తున్నారు. దుష్ప్రచారమే ఎన్నికల వ్యూహంగా మారింది. మేనిఫెస్టో గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రలోభ అంశాలకు ప్రాధాన్యత పెంచి ఓట్లు దండుకుంటున్నారు.’’ అని జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
ప్రజాస్వామ్యం పరాజయం పాలవుతోందని జస్టిస్ ఎన్.వి.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. యువత, మేధావులు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ‘‘రాజకీయాల్లో నీతిమంతులు రాకపోతే.. నీతిలేని వారే రాజ్యమేలుతారు.వారు చేసే నష్టాన్ని పూడ్చడానికి దశాబ్దాలు పడుతుంది.ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు తెలుగువారు విశ్రమించొద్దు. విద్యార్థులను రాజకీయాలకు దూరం చేయడం వల్లే అథోగతి పాలవుతున్నాం. కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
-
Cheetah : భారత్కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!