కాల్గరీ కెనడా సాయిబాబా మందిరంలో ఘనంగా కార్తీక దీప వేడుకలు

రీ అనఘా దత్త సొసైటీ ఆధ్వర్యంలోని కెనడా కాల్గరీ సాయిబాబా మందిరంలో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి.

Published : 22 Nov 2021 18:52 IST

కెనడా: శ్రీ అనఘా దత్త సొసైటీ ఆధ్వర్యంలోని కెనడా కాల్గరీ సాయిబాబా మందిరంలో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి. భగవన్నామస్మరణ, భక్తి కీర్తనలు, ధూప, దీప నైవేద్యాలతో వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఉత్సవ మూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు, హారతులతో వేడుకలు ప్రారంభం కాగా, మధ్యాహ్న హారతి, రుద్ర హోమం, కార్తీక పూర్ణిమ సత్యనారాయణస్వామి వత్రాన్ని భక్తి పారవశ్యంతో నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు పండిట్ రాజకుమార్‌శర్మ కార్తీక దీప విశేషాన్ని ఈ సందర్భంగా భక్తులకు వివరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దాదాపు నాలుగు వందల మందికి పైగా భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు లలిత, శైలేష్, వాలంటీర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకురాలు లలిత మాట్లాడుతూ.. ఏ దేశ మేగినా ఎందుకాలిడినా మన హైందవ సంప్రదాయ కొనసాగించాలని, హిందూ రక్షణలో భాగం కావాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని