Gokul Rachiraju: ఎన్‌ఆర్‌ఐ గోకుల్‌ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం

అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్‌ఆర్‌ఐ గోకుల్‌ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్‌ఆర్‌ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్‌ఆర్‌ఐలు సంతాపం వ్యక్తం చేశారు.

Updated : 10 Jul 2024 11:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్‌ఆర్‌ఐ గోకుల్‌ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్‌ఆర్‌ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్‌ఆర్‌ఐలు సంతాపం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. బేఏరియాలో గోకుల్‌ అందరికీ సుపరిచితుడని, ఎంతోమందికి ఆప్తమిత్రుడని కొనియాడారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఎల్లప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ ఉండే గోకుల్‌ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ఎన్‌ఆర్‌ఐలు పేర్కొన్నారు. భౌతికంగా తమ నుంచి దూరమైనా.. ఆయన జ్ఞాపకాలు పదిలమని స్వాగత్‌ స్నేహబృందం గోకుల్‌కు నివాళులర్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని