న్యూయార్క్‌లో ఘనంగా కూటమి సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. 

Updated : 25 Jun 2024 11:29 IST

న్యూయార్క్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ ప్రజావిజయాన్ని ప్రవాసులు ఘనంగా నిర్వహించారు. జూన్ 23న న్యూయార్క్‌ నగరంలోని జేరికో పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు, ఎన్డీయే మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు వోలేటి, ప్రసాద్‌ కోయి, అశోక్‌ అట్టాడ, దిలీప్‌ ముసునూరు తదితరులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

ఈ వేడుకల్లో వక్తలు డా. తిరుమలరావు తిపిర్నేని, కోటేశ్వర రావు బొడ్డు, అంజు కండబోలు, డా.జగ్గారావు అల్లూరి, డా. పూర్ణచంద్ర రావు అట్లూరి, డా.కృష్ణారెడ్డి గుజవర్తి, తానా మాజీ అధ్యక్షులు జయ్‌ తాళ్లూరి, సత్య చల్లపల్లి, ఉదయ్‌ దొమ్మరాజు, సుమంత్‌ రామిశెట్టి, నిర్వాహకులు వెంకటేశ్వరరావు వోలేటి, ప్రసాద్‌ కోయి, అశోక్‌ అట్టాడ, దిలీప్‌ ముసునూరు ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

రామోజీరావుకు ఘన నివాళి..

ఈ సందర్భంగా రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఘన నివాళి అర్పించారు. ఆయన తెలుగు జాతికి తెచ్చిన గుర్తింపును పలువురు వక్తలు స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని