గ్రామీణ పేద విద్యార్థులకు ‘కమ్మ యువ సేవా సమితి’ చేయూత

అమెరికాలోని బే ఏరియాకు చెందిన ‘కమ్మ యువ సేవా సమితి (KYSS)’ సహకారంతో చేతనా ఫౌండేషన్‌ (యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో గ్రామీణ పేద విద్యార్థినులకు సుమారు రూ.22లక్షల స్కాలర్‌షిప్‌లను అందించారు.

Updated : 07 Sep 2023 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని బే ఏరియాకు చెందిన ‘కమ్మ యువ సేవా సమితి (KYSS)’ సహకారంతో చేతనా ఫౌండేషన్‌ (యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో గ్రామీణ పేద విద్యార్థినులకు సుమారు రూ.22లక్షల స్కాలర్‌షిప్‌లను అందించారు. గుంటూరులోని కమ్మ జన సేవాసమితి బాలికల హాస్టల్‌లో చదువుతున్న 150 మంది విద్యార్థినులకు రూ.15వేలు చొప్పున అందజేశారు.

గుంటూరులోని స్థానిక కళాశాలల్లో ఉంటూ డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్థినుల ఆర్థిక కష్టాలు చూసి వారి హాస్టల్ ఖర్చులు భరించేందుకు కేవైఎస్‌ఎస్‌ సభ్యులు సభ్యులు రావడం పట్ల కమ్మ జన సేవా సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాగే పేద విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లను అందించడమే కాకుండా వారికి కెరీర్‌పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని కేవైఎస్‌ఎస్‌ సభ్యుడు సత్య పువ్వాడ తెలిపారు. నాలెడ్జ్‌ ఎకానమీలో రాణించాలంటే ఉన్నత చదువులే ఏకైక మార్గమని.. క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి విజయాలు సాధించవచ్చన్నారు. మనదేశం ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న విజయాలకి చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1లే తార్కాణమన్నారు. ఆయా కార్యక్రమాలను ముందుండి నడిపించడం మహిళా శక్తిని నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమ్మ జనసేవా సమితి, చేతనా ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు