USA: పిట్స్‌బర్గ్‌ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా సుదర్శన యాగం

పిట్స్‌బర్గ్‌ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాసుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహించారు.

Updated : 04 Aug 2023 20:40 IST

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జులై 27 నుంచి 30వ తేదీ వరకు మహా సుదర్శన యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం, పుష్ప యాగం, గరుడ వాహన సేవ నిర్వహించారు. పిట్స్‌బర్గ్‌ పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఆలయ నిర్వహణ అధికారులు, బోర్డు సభ్యులు, ఈసీ సభ్యులు భక్తులకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భక్తి కార్యక్రమాలతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు