ఉత్సాహంగా సాగిన ‘మాయా బ‌జార్‌-2022’

బే ఏరియాలో నిర్వహించిన మాయా బజార్-2022 ప‌ర‌వ‌శింప‌జేసింది. భారతీయ కమ్యూనిటీలో ఒక ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా నిలిచినట్లు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు. 

Updated : 18 May 2022 00:45 IST

అమెరికా: బే ఏరియాలో నిర్వహించిన మాయా బజార్-2022 ప‌ర‌వ‌శింప‌జేసింది. భారతీయ కమ్యూనిటీలో ఒక ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా నిలిచినట్లు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(ఏఐఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఉత్సవం అంద‌రినీ మంత్రముగ్ధులను చేసింది. పదివేల మందికిపైగా మంది ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని తమ కుటుంబ సభ్యులతో ఉత్సహాంగా గడిపారు. మాయా బజార్ రిఫ్రెష్‌గా, మనోహరంగా, దృశ్యపరంగా అద్భుతమైంద‌ని, పూర్తిగా ఆకర్షణీయంగా ఉందని ఈ కార్యక్రమానికి వచ్చినవారు పేర్కొన్నారు. బే ఏరియా మొత్తం స్వచ్ఛమైన ఆహ్లాద‌క‌ర సంగీతంతో మార్మోగింది.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల వరకు సాగింది. ఛోటా భీమ్, చుట్కీ వేషధారణతో పిల్లలు, పెద్దలను అల‌రించారు. పిల్లల కోసం అనేక కార్నివాల్ గేమ్‌లు, స్లయిడ్‌లు నిర్వహించారు. జంగిల్ బుక్, డైనోసార్ పెట్టింగ్ జూ, జంప్ హౌస్‌లు పిల్లలతో రన్‌అవే వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాయాబజార్ ఎక్స్‌ప్రెస్ వంటివి చిన్నారులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. 

ఈ ఈవెంట్‌కు గ్రాండ్ స్పాన్సర్‌గా సంజీవ్ గుప్తా సీపీఏ, రియల్టర్ నాగరాజ్ వ్యవహరించారు. సిటీ ఆఫ్ శాన్ రామన్ ఈవెంట్ పార్ట్‌నర్‌, బోలీ 92.3 FM సహ-స్పాన్సర్‌గా వ్యవహరించాయి. రైట్ బైట్ డెంటల్ సమర్పించారు. సిల్వర్ స్పాన్సర్‌గా రాయ్ చెట్టి (ఫార్మర్స్ ఇన్సూరెన్స్), ఇతర స్పాన్సర్‌లుగా ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆజాద్ ఫైనాన్షియల్స్, మాన్‌ప్రెన్యూర్‌ వ్యవహరించాయి. 

ఈ కార్యక్రమంలో భారతీయ సాంస్కృతిక, కళారూపాలను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కూచిపూడి, భరత నాట్యం, కథక్ శాస్త్రీయ నృత్యాలు ఫుట్ వాద్యం, పలు తెలుగు సినిమాల నృత్యాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. బాటా కరోకే బృందం తన గానంతో సభికులను అలరించారు. ఇక‌, ఆహారం విష‌యానికి వ‌స్తే.. మిర్చి మసాలా- ఫుడ్ ఫెస్టివల్ విశిష్టమైన ప్రెజెంటేషన్‌తో వివిధ రుచికరమైన వంటకాలను అందించారు. దానికి తోడు షాపింగ్ చేయాల‌ని ఉవ్విళ్లూరేవారికి మాయాబజార్ ఓ వేదిక‌గా మారింది. 65 మంది విక్రేతలు ఈవెంట్ స్పాన్సర్‌లు, దుస్తులు, నగలు, మెహందీ, రియల్ ఎస్టేట్, పాఠశాలలు, ఐటీ శిక్షణ, ఆరోగ్య సేవలు, సంగీత పాఠశాలలు తదితర వాటిని ప్రదర్శించారు. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) బోన్ మ్యారో డ్రైవ్ నిర్వహించింది.

ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ డా.టి.వి నాగేంద్ర ప్రసాద్‌ను అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(ఏఐఏ) బృందం ఘనంగా సత్కరించింది. అసెంబ్లీ సభ్యుడు రెబెక్కా బాయర్, శాన్ రామన్ మేయర్ డేవిడ్ హడ్సన్, శాన్ రామన్ వైస్ మేయర్ శ్రీధర్ వెరోస్, కౌన్సిల్ మెంబర్ సబీనా జాఫర్, డబ్లిన్ సిటీ వైస్ మేయర్ జీన్ జోసీ, కౌన్సిల్ సభ్యుడు మైఖేల్ మెక్‌కోరిస్టన్, మౌంటైన్ హౌస్ ప్రి హారీ డి.ధిల్లాన్, ట్రేసీ సిటీ మేయర్ ప్రోటెమ్ వెరోనికా వర్గాస్‌, ఎరిక్ స్వాల్వెల్ కార్యాలయం నుంచి జిల్లా డైరెక్టర్‌ను సత్కరించారు. ఇంత ఆహ్లాదకరంగా వేసవి ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా స్టా కమ్యూనిటీ కళాశాల బోర్డు అధ్యక్షుడు ఆండీ లీతో పాటు పలువురు ప్రముఖులు ఏఐఏని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆశాజ్యోతి, స్పందన, శంకర్‌ ఐ ఫౌండేషన్‌ వాలంటీర్లకు ఏఐఏ బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన రాబడిలో కొంత భాగాన్ని లాభాపేక్షలేని సంస్థలకు విరాళంగా అందించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని