ఐర్లాండ్‌లో ఘనంగా నారా లోకేశ్‌ బర్త్‌ డే వేడుకలు

తెదేపా నేత నారా లోకేశ్‌ పుట్టిన రోజు వేడుకలు డబ్లిన్‌లో ఘనంగా జరిగాయి. తెదేపా  ఐర్లాండ్‌ విభాగం సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా యువగళం గోడపత్రికను ఆవిష్కరించారు.

Published : 30 Jan 2023 20:15 IST

డబ్లిన్‌: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పుట్టిన రోజు వేడుకలు టీడీపీ ఐర్లాండ్‌ విభాగం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు సభ్యులు కేకు కట్‌ చేసి లోకేశ్‌కు బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఆయన మంత్రి పదవుల్లో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంతకుముందు తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉన్నత చదువుల కోసం యూరప్‌లోని పలు దేశాలకు వచ్చి తెదేపా ఐర్లాండ్‌ విభాగం ద్వారా ఉన్నత ఉద్యోగావకాశాలు, సహకారం పొందిన వారు తమ అనుభూతుల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ ‘యువగళం’ పేరుతో కొనసాగిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువై తెదేపాను విజయతీరాలకు చేర్చాలని ఆకాంక్షిస్తూ తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. అలాగే, యువగళం గోడపత్రికను ఆవిష్కరించారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. వందల మంది ఐర్లాండ్‌ విభాగం సభ్యులు, మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డా. కిషోర్ బాబు, కృష్ణ ప్రసాద్, నాగరాజు జూడ, ప్రముఖ్, కిషోర్ మాదల, శివ బాబు, రంగా గల్లా, కోటేంద్ర, శ్రీనివాస్ పుట్టా, లక్ష్మీ శ్రీనివాస్, భరత్ భాష్యం, రామ్ వంగవోలు, శ్రీకర్ తదితరులు ఘనంగా నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని