Nara Lokesh: లండన్‌, కోవెంట్రీలో ఘనంగా నారా లోకేశ్‌ పుట్టినరోజు వేడుకలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పుట్టినరోజు వేడుకలను యూకేలో ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూకే విభాగం ఆధ్వర్యంలో లండన్‌, కోవెంట్రీ నగరాల్లో వేడుకలు జరిగాయి.

Published : 24 Jan 2023 12:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పుట్టినరోజు వేడుకలను యూకేలో ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూకే విభాగం ఆధ్వర్యంలో లండన్‌, కోవెంట్రీ నగరాల్లో వేడుకలు జరిగాయి. లండన్‌ సమీపంలోని హౌన్స్లో పట్టణంలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూకే అధ్యక్షుడు పోపూరి వేణుమాధవ్‌ ఆధ్వర్యంలో బర్త్‌డే కేక్‌ కట్‌ చేసి లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కోవెంట్రీలో యూకే తెదేపా ఉపాధ్యక్షుడు చక్రి మొవ్వా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. 

ఈ సందర్భంగా ‘యువగళం’ పాదయాత్ర విజయవంతం కావాలంటూ ఎన్‌ఆర్ఐ తెదేపా యూకే శ్రేణులు హౌన్స్లో పట్టణంలో ర్యాలీ నిర్వహించాయి. అనంతరం నిర్వహించిన సభలో నేతలు మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్‌లో అంధకారం తొలగి మళ్లీ అభివృద్ధి పథంలోకి రావాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ నినాదాలతో నేతలు హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో యూకే నేతలు శ్రీకిరణ్‌ పరుచూరి, ప్రసన్న నాదెండ్ల, సురేశ్‌ కోరం, శ్రీనివాస్‌ పాలడుగు, నవీన్‌ జవ్వాడి, సుందర్‌రాజు మల్లవరపు, మేరీ కల్పన, భాస్కర్‌ అమ్మినేని, అమర్నాథ్‌ మన్నే, కుమార్‌ నిట్టల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని