ఫ్లోరిడాలో ‘నాట్స్’ టాయ్ డ్రైవ్.. అనాధాశ్రమంలో చిన్నారులకు దుస్తులు పంపిణీ
ఫ్లోరిడాలోని టాంప బేలో అనాథ చిన్నారులకు నాట్స్ ఈస్టర్ దుస్తులను విరాళంగా అందజేసింది.
టాంప బే: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతోన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని టాంప బేలో అనాథ చిన్నారులకు నాట్స్ ఈస్టర్ దుస్తులను విరాళంగా అందజేసింది. హోప్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ హోమ్‌లో చిన్నారులకు దుస్తులు విరాళంగా ఇచ్చేందుకు చేపట్టిన ఈ ఈస్టర్ దుస్తులు విరాళం విజయవంతంగా జరిగింది. నాట్స్ సభ్యులు, తెలుగువారు చాలా మంది బొమ్మలను విరాళంగా అందజేశారు. ఇలా నాట్స్ సేకరించిన దుస్తులు హోప్ చిల్డ్రన్ హోమ్‌కి విరాళంగా అందించడం జరిగింది. నాట్స్ చేపట్టిన ఈస్టర్ దుస్తుల విరాళం కార్యక్రమం పట్ల హోప్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. నాట్స్ సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది. నాట్స్ సభ్యులతో పాటు వారి పిల్లలు కూడా ఇందులో భాగస్వాములై ఈస్టర్ దుస్తులు విరాళ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిన్నారుల్లో సేవాభావాన్ని పెంపొందించేందుకు, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే భావన పెంచడానికి ఈ ఈస్టర్ దుస్తులు విరాళం ఎంతగానో దోహద పడుతుందని హోప్ సంస్థ తెలిపింది. నాట్స్ చేపట్టిన ఈస్టర్ దుస్తులు విరాళం విజయవంతం చేయడానికి ప్రశాంత్ పిన్నమనేని, రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, విజయ్ కట్టా, భార్గవ మాధవరెడ్డి తదితరులు కీలక పాత్ర పోషించారు.
ఈ టాయ్ డ్రైవ్ కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా.కొత్త శేఖరం, బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది తదితరులకు నాట్స్ టాంప బే విభాగం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఫైనాన్స్/మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్స్ నేషనల్ కో-ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహ మండలి సభ్యులు ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కో ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో-ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోఆర్డినేటర్ కమిటీ చైర్స్ భరత్ ముద్దన, హరి మండవతో పాటు నాట్స్ వాలంటీర్‌లందరూ చక్కటి ప్రణాళికతో టాయ్ డ్రైవ్‌ని విజయవంతం చేశారు. భావితరానికి సేవాభావాన్ని పెంపొందించేందుకు టాయ్ డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టాంప బే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టంపాబే విభాగం టాయ్ డ్రైవ్ నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టాంప బే నాయకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సెక్రటరీ రంజిత్ చాగంటి, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళీ కృష్ణ మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. మరో నలుగురు అరెస్టు
-
General News
AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం
-
Sports News
GT vs CSK: చెలరేగిన సుదర్శన్.. చెన్నై విజయలక్ష్యం 215
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్