Netherlands: నెదర్లాండ్స్‌లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు

నెదర్లాండ్స్‌లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Published : 11 Jul 2024 11:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నెదర్లాండ్స్‌లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందోవెన్‌ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, వెనిగండ్ల రాము, సొంగా రోషన్‌, తెదేపా నాన్‌ రెసిడెంట్స్‌ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ తదితరులు జూమ్‌ ద్వారా హాజరై అందరినీ అభినందించారు. అనంతరం అభిమానులు విజయోత్సవ కేక్‌ను కట్‌ చేసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెదేపా కార్యవర్గ సభ్యులు వివేక్‌ కరియావుల, వెంకట్‌ కోకా, తేజా గోయల్లా, శ్యామ్‌ పంపాన, మధుకర్‌రెడ్డి, ప్రసాద్‌, అమర్‌ రావి, నవీన్‌ ఆచంట తదితరులు పాల్గొన్నారు. జనసేన తరఫున ప్రతాప్‌,  రాజు, శ్రీనివాస్‌, నాగరాజు.. భాజపా నుంచి ప్రతిమ సింగ్‌, తిరుమలనాయుడు తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని