మిన్నియాపోలిస్‌లో మిన్నంటిన ఎన్డీయే కూటమి విజయోత్సవ సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు.

Updated : 20 Jun 2024 00:33 IST

అమెరికా: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అఖండ విజయంతో అమెరికాలోని ఎన్నారైలు సంబరాలు చేసుకొంటున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపోలిస్‌, సెయింట్‌ పాల్‌ నగరాల్లో ఎన్డీయే కూటమిలోని పార్టీలకు చెందిన ఎన్నారై విభాగాల నేతలు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మందికి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఎన్నారైలు తమ మూలాలను మరిచిపోకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోటీ చేసి విజయం సాధించిన సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.

ఇంటర్నెట్‌ వేదికగా సందేశాలిచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పామర్రు ఎమ్మెల్యే విజయ్‌ కుమార్‌ రాజా తదితరులు  తాము చేయబోయే కార్యక్రమాల్ని వివరించారు. తమ విజయం కోసం ఎన్నారైలు పడిన కష్టాన్ని, సహాయాన్ని మరిచిపోలేమన్నారు. ఈ విజయోత్సవ వేడుకలకు ఎన్నారై టీడీపీ మిన్నియాపోలిస్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు రామ్‌ వంకిన, రావ్‌ గుత్తా, వెంకట్‌జువ్వా, వేదవ్యాస్‌ అరవపల్లి, అజయ్‌ తాళ్లూరి, వివేక్‌ వల్లూరి, శ్రీమాన్‌ యార్లగడ్డ,  నాగ్ నల్లబోలు, నాయుడు సాలాది, కాశీ బురిడి, ఆర్కే, వెంకన్న చౌదరి, సుమన్ లావు, హరీష్ చింతాడ, పరమేశ్వర్, నాగ్ బొల్లు, సత్యనారాయణ, అనిల్ స్వయంపు, మురళి ముత్యాల, బాల అక్కిన, అశోక్ సుంకవల్లి, కోటేశ్వర పాలడుగు, జనసేన నాయకులు సంతోష్, రఘు గొలకోటి, రామ్ కూటల,  తదితరులు సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ విందు భోజనం వడ్డించారు. మిన్నియాపోలిస్,  సెయింట్ పాల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న తెదేపా, జనసేన, భాజపా నేతలతో పాటు ఆయా ప్రాంతాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు మహిళలు, చిన్నారులు, పెద్దలు సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని