న్యూజెర్సీ తెలుగు కళా సమితి కొత్త కార్యవర్గం ఎన్నిక

న్యూజెర్సీలోని ప్రముఖ తెలుగు సంఘం ‘తెలుగు కళా సమితి’ నూతన కార్యవర్గం ఎన్నికైంది. మే 12, 13 తేదీల్లో హోరాహోరీగా.....

Published : 26 May 2022 19:21 IST

అమెరికా: న్యూజెర్సీలోని ప్రముఖ తెలుగు సంఘం ‘తెలుగు కళాసమితి’ నూతన కార్యవర్గం ఎన్నికైంది. మే 12, 13 తేదీల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా మధు రాచకుళ్ళ తన సమీప ప్రత్యర్థి గురు ఆలంపల్లిపై ౩౩5 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. న్యూజెర్సీలో తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణకు, పరివ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తనకు ఈ అవకాశం కల్పించిన సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు కళా సమితి సీనియర్ ట్రస్టీలుగా రవి అన్నదానం, బిందు యలమంచిలి , అనూరాధ దాసరి, శ్రీనివాస్ చెరువు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. సుధా దేవులపల్లి, శ్రీదేవి పులిపాక, జ్యోతి కామరాసు, నాగ మహేందర్ వెలిశాల ట్రస్టీలుగా గెలుపొందారు.

అనంతరం 2022-24 మధ్య కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నికల నిర్వహణాధికారి శంకరరావు పోలేపల్లి ప్రకటించారు. అధ్యక్షుడిగా మధు రాచకుళ్ళ, ఉపాధ్యక్షులుగా అనూరాధ దాసరి, కార్యదర్శిగా రవి అన్నదానం, సాంస్కృతిక కార్యదర్శిగా బిందు యలమంచిలి, కోశాధికారిగా శ్రీనివాస్ చెరువు, యువజన కార్యదర్శిగా సుధా దేవులపల్లి, సామాజిక కార్యదర్శిగా శ్రీదేవి పులిపాక, సర్వసభ్య కార్యదర్శిగా జ్యోతి కామరాసు, సాంకేతిక కార్యదర్శిగా నాగ మహేందర్ వెలిశాల మే 18న ప్రమాణస్వీకారం చేసినట్టు తెలుగు కళాసమితి ప్రతినిధులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని