
ఒహైయో సెనేట్‌కు తొలి భారత సంతతి వ్యక్తి..
వాషింగ్టన్: అగ్రరాజ్యంలోని ఒహైయో రాష్ట్ర చట్టసభ సభ్యుడిగా తొలిసారి ఓ భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. 29 ఏళ్ల వయస్సులోనే నీరజ్ జే అంతానీ .. ఒహైయో సెనేట్‌కు ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. ఆ రాష్ట్రంలోని సిక్స్త్ డిస్ట్రిక్ట్ ప్రాంత సెనేటర్‌గా స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఆయన ప్రమాణం చేశారు. నాలుగు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడైన అంతానీ.. 2014 నుంచి ఇప్పటి వరకు 42వ ఓహియో హౌస్ డిస్ట్రిక్ట్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.
తాను పుట్టి పెరిగిన భారతీయ సమాజానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నానని నీరజ్ అంతానీ అన్నారు. ఈ అవకాశమిచ్చిన ఓటర్లు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.