ఆదినారాయణ కుటుంబానికి ఎన్నారైల సాయం

 తమ దాతృత్వానికి ఎల్లలు లేవని పలువురు ఎన్నారైలు మరోసారి నిరూపించారు. గతేడాది డిసెంబర్‌లో కర్నూలు నగరం నుంచి శబరిమల యాత్రకు ......

Updated : 03 Jan 2022 22:21 IST

కర్నూలు: తమ దాతృత్వానికి ఎల్లలు లేవని పలువురు ఎన్నారైలు మరోసారి నిరూపించారు. గతేడాది డిసెంబర్‌లో కర్నూలు నగరం నుంచి శబరిమల యాత్రకు బయలుదేరి గమ్యాన్ని చేరుకొనే లోపే కేరళలోని శివకోయిల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. కర్నూలుకు చెందిన బాధితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా ఎన్నారై ఫౌండేషన్‌ ఛైర్మన్‌ పొట్లూరి రవి కోరడంతో వెంటనే స్పందించిన పలువురు ఎన్నారైలు ముందుకొచ్చి ఈ సాయాన్ని అందజేశారు. ఎన్నారైలు సమకూర్చిన ఈ డబ్బును కర్నూలు సిటీ డీఎస్పీ కేవీ మహేష్.. ఆదినారాయణ కుమార్తె రేఖకు అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, రేఖ చదువుకు కూడా సహకారం అందించనున్నట్టు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ తబరేజ్ మాట్లాడుతూ.. సహాయం అందించిన ఎన్నారైల సేవానిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సందడి మధు, జంపాల అమిత్, నంది మధు, మీనాక్షి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts