Published : 22 Jul 2022 22:00 IST

మంత్రముగ్దుల్ని చేసిన కూచిపూడి నృత్యం.. చికాగోలో రఘుపాత్రుని శ్రీకాంత్‌కు సన్మానం

చికాగో: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా చికాగోలో కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహూతుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించి 36 కళారూపాలను ఎంపిక చేసిన భారత ప్రభుత్వం.. కూచిపూడి నృత్య విభాగంలో ఏపీ నుంచి ఎంపికైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన శివశ్రీ నృత్య కళానికేతన్‌ బృందాన్ని అమెరికా పంపింది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు గురువు డాక్టర్‌ రఘుపాత్రుని శ్రీకాంత్‌ ప్రతిభను చాటేలా ఆహూతుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ గురు రఘుపాత్రుని శ్రీకాంత్‌ని సన్మానించారు. భారతీయ కళారూపాల్లో కూచిపూడి నృత్యం ప్రపంచ ప్రఖ్యాతి సాధించడం గర్వకారణమన్నారు. ఈ నృత్యం తెలుగు జాతికి జీవనాడిలాంటిదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు నృత్యంలో శిక్షణ ఇచ్చి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన శ్రీకాంత్‌ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాన్సుల్‌ వినోద్‌ గౌతమ్‌, ఇండియా హబ్‌ నిర్వాహకులు వినోద్‌ చనుమోలు, డాక్టర్‌ శ్రీరామ్‌ శొంఠి, అపర్ణ అయ్యలరాజు తదితరులు ప్రసంగించారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని