ఆగస్టు 15న డాలస్‌లో ‘ఇండియన్‌ అమెరికన్‌ డే’

ఆగస్టు 15వ తేదీని డాలస్‌లో ‘ఇండియన్‌ అమెరికన్‌ డే’గా గుర్తిస్తున్నట్టు డాలస్‌ మేయర్‌ ఎరిక్‌ జాన్సన్‌ ప్రకటించారు. భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా......

Published : 14 Aug 2022 20:37 IST

డాలస్‌/టెక్సాస్‌: ఆగస్టు 15వ తేదీని డాలస్‌లో ‘ఇండియన్‌ అమెరికన్‌ డే’గా గుర్తిస్తున్నట్టు డాలస్‌ మేయర్‌ ఎరిక్‌ జాన్సన్‌ ప్రకటించారు. భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆయన డాలస్‌ సిటీ హాల్‌లో కొద్దిమంది ప్రవాస భారతీయ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. డాలస్‌, ఫోర్ట్‌ వర్త్‌ నగర పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తూ వైద్య, విద్య, వ్యాపార, వాణిజ్య, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఉత్తర టెక్సాస్‌లో ప్రవాస భారతీయులు వివిధ వ్యాపార రంగాల్లో స్థిరపడి 10 బిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయాన్ని సృష్టిస్తూ ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారని.. వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. డాలస్‌ నగర మేయర్‌ ఆత్మీయ ఆహ్వానం మేరకు ఈ ప్రత్యేక అభినందన కార్యక్రమానికి ప్రవాస భారతీయ నాయకులు అరుణ్‌ అగర్వాల్‌, సల్మాన్‌ ఫర్‌ షోరి, రజనీష్‌ గుప్తా, డా. ప్రసాద్‌ తోటకూర  హాజరు కాగా.. వారికి మేయర్‌ ఎరిక్‌ జాన్సన్‌ ఆగస్టు 15వ తేదీని డాలస్‌లో ‘ఇండియన్‌ అమెరికన్‌ డే’గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన అధికారిక పత్రాన్ని అందజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని