కాకతీయ వృద్ధాశ్రమం ఓ వసుధైక కుటుంబం: సతీశ్‌ వేమన

కాకతీయ వయో వృద్ధుల ఆశ్రమం వసుధైక కుటుంబం అని తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో మంగళవారం......

Published : 28 Dec 2021 21:40 IST

వాషింగ్టన్‌ డీసీ: కాకతీయ వయో వృద్ధుల ఆశ్రమం వసుధైక కుటుంబం అని తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో మంగళవారం కాకతీయ వృద్ధాశ్రమంలో బ్రోచర్‌ను గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సంఘ కార్యదర్శి కొత్తపల్లి రమేశ్ కృష్ణచంద్రను సన్మానించారు. ఈ సందర్భంగా సతీశ్‌ వేమన మాట్లాడుతూ.. మంచి భవిష్యత్తు కోసం, ఉన్నతస్థాయిలో జీవితం గడిపేందుకు అనేకమంది తెలుగువారు అమెరికా వచ్చారన్నారు. కానీ వారి తల్లిదండ్రులు వారి స్వస్థలాల్లోనే ఉంటున్నారనీ, వారికి ఎలాంటి ఆసరా లేకుండా పోయిందని తెలిపారు. వారి పిల్లలు దూరంగా ఉన్నారనే లోటు లేకుండా కాకతీయ సీనియర్‌ సిటిజెన్స్‌ వారు భరోసా కల్పించడం అభినందనీయమన్నారు. 

అనంతరం గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. కాకతీయ వృద్ధాశ్రమంలో అత్యాధునిక సదుపాయాలతో మౌలికవసతులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టారని ప్రశంసించారు. సమాజ హితం కోసం, సంక్షేమం కోసం పవిత్రమైన కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ప్రస్తుతం రూ.25కోట్ల బడ్జెట్‌తో 200మంది ఉండేలా వసతులతో నిర్మాణం చేపట్టినట్టు కొత్తపల్లి రమేశ్‌ కృష్ణ చంద్ర అన్నారు. తదుపరి అవసరాల నిమిత్తం మరింత విస్తరణ చేపట్టి ఎక్కువ మందికి ఆశ్రమంలో వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమంలో ఎక్కువ మంది భాగస్వాములు కావడం ద్వారా తోటివారికి, సాటివారికి సహాయపడినవారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో భాను ప్రసాద్‌ మాగులూరి, రామ్‌ చౌదరి ఉప్పటూరి, రమాకాంత్‌ కోయా, సిద్ధార్థ బోయపాటి, డా. నాగశంకర్‌ దేవినేని, డా. లిఖిత ఎల్లా, సాయి మండవ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని