ప్రవాసాంధ్రుడు శ్రీరావుకు అమెరికాలో అరుదైన గుర్తింపు
అమెరికాలో ప్రవాసాంధ్రుడైన శ్రీ రావు బొడ్డపు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఎసొల్విట్ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన 50వ వసంతంలోకి అడుగు పెట్టిన ......
అమెరికా: అమెరికాలో ప్రవాసాంధ్రుడైన శ్రీరావు బొడ్డపు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఎసొల్విట్ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడైన ఆయన 50వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా లాభాపేక్షలేని ‘బ్లెస్సింగ్ అకౌంట్’ని ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ఆయన అమెరికాలో స్థిరపడి.. గత రెండున్నర దశాబ్దాలుగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుసేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆయన అందించిన సేవలకు గానూ వాషింగ్టన్ డీసీ నుంచి అమెరికన్ కాంగ్రెస్‌మెన్ లాయడ్ డొగ్గెట్ ఆ దేశ జాతీయ పతాకాన్ని (ఆనర్ ఆఫ్ ఫ్లాగ్) ప్రత్యేకంగా పంపారు. ఈ గౌరవం దక్కించుకున్న మూడో ప్రవాస భారతీయుడిగా శ్రీరావు గుర్తింపు పొందడం విశేషం. ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించి శ్రీరావు బొడ్డపు, ఉషా బొడ్డపు దంపతులిద్దరూ అనేక అవార్డులు పొందారు. తాజాగా ఆస్టిన్‌లో బ్లెస్సింగ్ అకౌంట్‌ను ప్రారంభించిన సందర్భంగా శ్రీరావు దంపతుల్ని టెక్సాస్‌కు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీరావు బొడ్డపు మాట్లాడుతూ.. తనకు 50 ఏళ్లు నిండాయని సెలబ్రేట్ చేసుకోవడం తన ఉద్దేశం కాదన్నారు. ఇప్పటివరకు తన భార్యతో కలిసి అనేక మంది వృద్ధుల్ని దత్తత తీసుకున్నానని, చాలా మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈ సేవా దృక్పథాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. దీన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వేదికను ఏర్పాటు చేసి సేవా భావంతో పనిచేస్తున్న అందరినీ కనెక్ట్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెట్‌వర్క్ ద్వారా తమ సేవాభావాన్ని చాటేందుకు బ్లెస్సింగ్ ఖాతా తీసుకొని ఉంటే.. దీనివల్ల ఎంతమందికి సహాయం చేశారు? ఎవరికి చేశారు? తదితర వివరాలన్నీ తెలియడం ద్వారా ఈ ఛారిటీ కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చని అభిప్రాయపడ్డారు.
25 ఏళ్లుగా తాము భారత్‌లో అనేక ఉద్యోగాలు కల్పించినట్టు శ్రీరావు సతీమణి ఉషా బొడ్డపు తెలిపారు. భారత్‌లో వృద్ధులకు ఔషధాలు పంపిణీ చేస్తున్నామనీ.. ఇంటి పెద్ద దిక్కులేని కుటుంబాల పిల్లలకు ల్యాప్‌టాప్‌లను ఇవ్వడంతో పాటు వారికి శిక్షణ కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించినట్టు వెల్లడించారు. తాడేపల్లిగూడెంలోని ఉన్నత పాఠశాలలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆమె వివరించారు. దీన్ని మరింతగా కొనసాగించాలనే సంకల్పంతోనే బ్లెస్సింగ్ అకౌంట్ ప్రారంభించినట్టు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shaakuntalam: ‘శాకుంతలం’ కలెక్షన్లు రాకపోవడానికి కారణం అదేనేమో..: పరుచూరి విశ్లేషణ
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Palnadu: కుమారుడి తల తెగ్గోసిన కన్నతండ్రి.. ఆపై దాంతో ఊరంతా తిరిగిన ఉన్మాది
-
India News
UPSC: ఆ ఇద్దరూ నకిలీ ర్యాంకర్లే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటాం: యూపీఎస్సీ
-
India News
భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే
-
Ts-top-news News
Eamcet: ఈసారీ ‘స్లైడింగ్’ పెత్తనం కళాశాలలదేనా?