ఎన్టీఆర్‌ శత జయంతి.. కువైట్‌లో ఎన్నారై టీడీపీ రక్తదాన శిబిరం

విశ్వవిఖ్యాత, నట సార్వభౌముడు, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను పురస్కరించుకొని కువైట్‌లో రక్తదాన.....

Published : 21 May 2022 17:24 IST

కువైట్‌: విశ్వవిఖ్యాత, నట సార్వభౌముడు, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను పురస్కరించుకొని కువైట్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్‌ భౌతికంగా మన మధ్యన లేకపోయినా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయమని పలువురు ఎన్నారైలు కొనియాడారు. ఆ మహా నేతను స్మరించుకుంటూ ఎన్నారై తెదేపా- కువైట్‌ (బీసీ విభాగం) ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో కువైట్‌ సెంట్రల్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 120 మంది కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు భారీగా తరలివచ్చి రక్తదానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. వారందరికీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అభినందన పత్రాలను అందజేసింది.

ఈ సందర్భంగా ఎన్నారై తెదేపా కువైట్‌ అధ్యక్షుడు నాగేంద్రబాబు అక్కిలి మాట్లాడుతూ ‘రక్తదానం అంటే ప్రాణ దానం. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా రక్తం అవసరం ఎక్కువ మనుషులకు మాత్రమే ఉంటుంది. ఈ దేశంలోనూ ఎంతోమంది తెలుగువారు ఉన్నారు. అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఆస్పత్రుల్లో అప్పటికప్పుడు సరిపడా గ్రూపు రక్తం దొరకకపోతే ఎంతో కష్టం. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ (కువైట్‌) జాయింట్ సెక్రెటరీ మోహన్ రాచూరి, మహిళా అధ్యక్షురాలు రాణి చౌదరి, మహిళా కార్యదర్శి విందు, యువత అధ్యక్షులు మల్లి మరాతు, బీసీ అధ్యక్షులు శంకర్ యాదవ్‌తో పాటు నేతలు యనిగల బాలకృష్ణ, కె. నరసింహ నాయుడు, రత్నం నాయుడు తుమ్మల, ప్రసాద్ పాలేటి, ఈరాతి శంకరయ్య, బొమ్ము నరసింహులు, శివకుమార్ గౌడ్,  ఆవుల చిన్నయ్య యాదవ్, ఈరాతి శంకరయ్య,  గుండయ్య నాయుడు , పెంచలయ్య పెరుమాళ్ల, పసుపులేటి విజయకుమార్, పసుపులేటి మల్లికార్జున, పసుపులేటి వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని