చంద్రబాబు అరెస్టుపై బ్రిస్బేన్‌లో ఎన్నారైల నిరసనలు
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ప్రవాసాంధ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన్ను అక్రమంగా అరెస్టు చేయడంపై మండిపడుతున్నారు.
బ్రిస్బేన్: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ప్రవాసాంధ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన్ను అక్రమంగా అరెస్టు చేయడంపై మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నారై బ్రిస్బేన్ టీడీపీ సభ్యులు చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రజల్లోకి వెళ్తున్న మాజీ సీఎం చంద్రబాబుకు వస్తున్న మద్దతును చూసి సీఎం జగన్ బెంబేలెత్తిపోతున్నారన్నారు. అందుకే ఆయన్ను కుట్రపూరితంగా అరెస్టు చేశారని విమర్శించారు. తమ అధినేతను అరెస్టు చేయించడం ద్వారా సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబును అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రావు, రవి చలసాని, రాజీవ్ పుచ్చకాయల, విశ్వ దాసరి, మాధవ్, నాగార్జున ఎడ్ల, హారిక కోనేరు, కార్తిక జనగామ, మణికంఠ, రామకృష్ణ గూడూరు, హరి వైట్ల, మురళీ చావా, నరేశ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.