తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూరప్‌ నాయకుడు డా.కిశోర్‌

తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూరోప్ టీమ్‌ నాయకుడు డాక్టర్ కిశోర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 01 May 2022 23:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూరోప్ టీమ్‌ నాయకుడు డాక్టర్ కిశోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో ఇటీవల యూరప్‌ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలు, పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావ వేడుక నిర్వహణపై ఆయన చంద్రబాబుకు వివరించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లా పూతలపట్టు, గుంటూరు జిల్లా అమరావతిలో ఐతెదేపా టీమ్‌ సహకారంతో ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూరోప్ టీమ్‌ ఏర్పాటు చేసిన అన్నదానం, ఇతర కార్యక్రమాల గురించి డా.కిశోర్‌ వివరించారు. 

రాబోయే రోజుల్లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూరోప్ టీమ్‌ చేపట్టనున్న కార్యక్రమాలు, 2024లో జరగనున్న ఎన్నికలలో సహాయ సహకారాలపై చర్చించారు. 2024లో తెలుగుదేశం గెలుపే ప్రధానంగా పని చేస్తామని ఆయన చంద్రబాబుకు తెలిపారు. త్వరలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాల గురించి కూడా ఈ సమయంలో చర్చించారు. యూరప్‌ వ్యాప్తంగా తెదేపా 40 వసంతాల వేడుక నిర్వహణపై డా.కిశోర్‌ను, ఎన్‌ఆర్‌ తెదేపా యూరప్‌ బృందాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులను తరలించడంపై చంద్రబాబు అభినందనలు తెలిపారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని, సామాజిక కార్యక్రమాలే కాకుండా ప్రతిఒక్క ఎన్‌ఆర్‌ఐ ఒక వ్యాపారవేత్తగా మారి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి, నిరుద్యోగ యువతకి ఉద్యోగవకాశాలు కల్పించాలని చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీలో పెట్టుబడుల కోసం యూరోప్‌లో పారిశ్రామికవేత్తలను కలిసిన విషయాలను గుర్తు చేసుకున్నారు. 2024లో పార్టీ గెలుపుకోసం శ్రమించాలి అని చంద్రబాబు ఆయనకు సూచించారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూరోప్ బృందం మున్ముందు చేసే సేవాకార్యక్రమాలకు పార్టీ తరుపున ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని డా.కిశోర్‌కు చంద్రబాబు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని