‘ఎన్నారై తెదేపా మహానాడు’కు శంఖారావం

అమెరికాలోని బోస్టన్‌లో ఎన్నారై తెదేపా మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు శంఖారావం పూరించాయి. ‘తెలుగుదేశం పిలుస్తోంది రా....

Published : 26 Apr 2022 19:51 IST

బాస్టన్‌: అమెరికాలోని బాస్టన్‌లో ఎన్నారై తెదేపా మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు శంఖారావం పూరించాయి. ‘తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా..’ అనే పిలుపుతో దాదాపు 250మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. ఎన్నారై తెదేపా కార్యకర్తతల కరతాళ ధ్వనుల మధ్య తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి, విద్యా గారపాటి మే 20, 21 తేదీల్లో బోస్టన్‌ వేదికగా జరగబోయే ఎన్నారై తెదేపా మహానాడుకు శంఖారావం పూరించారు. తెలుగు మహిళలు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా విద్యా గారపాటి మాట్లాడుతూ.. ప్రతి ఎన్నారై రోజుకు 15 నిమిషాల సమయం వెచ్చించి ఏపీలోని ప్రజలకు తెదేపా సిద్ధాంతాన్ని, లక్ష్యాలను వివరించి ఆలోపింపజేయాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చూడాలనుకున్న ఏపీని అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మార్చారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. 

 అనంతరం తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. వైకాపా పాలనపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దాదాపు గంట పాటు మాట్లాడిన ఆయన జగన్‌ నియంతృత్వ పాలనను ఎండగట్టారు. అనంతరం మహానాడు కేక్ కట్ చేసి, లోగోను, టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పెద్ద ఎత్తున పాల్గొని మహానాడుకు సిద్ధమంటూ జయ జయధ్వానాలు చేశారు.  చిన్న పిల్లలు, తెలుగు మహిళలు తెదేపా జెండాలతో ‘జై తెలుగుదేశం, జోహార్‌ ఎన్టీఆర్‌, జై చంద్రబాబు, జై లోకేశ్, మహానాడుకు సిద్ధం’’ అంటూ నినాదాలు చేస్తూ సభాప్రాంగణాన్ని హోరెత్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని