TDP: ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఐర్లాండ్ మేధోమథన సదస్సు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపా వివిధ విభాగాలను సమాయత్తం చేసే పనిలో భాగంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఐర్లాండ్ విభాగం ఆధ్వర్యంలో మేధోమథన సదస్సు నిర్వహించారు.
ఐర్లాండ్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపా వివిధ విభాగాలను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమైంది. దీనిలో భాగంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఐర్లాండ్ విభాగం ఆధ్వర్యంలో మేధోమథన సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, చంద్రబాబును మళ్లీ సీఎంని చేయడంలో ఎన్‌ఆర్‌ఐల పాత్ర గురించి చర్చించారు. ఈ సన్నాహక సమావేశానికి ఐర్లాండ్ లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ తెదేపా కార్యవర్గ సభ్యులు, అధికసంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగం అధిపతి రవి వేమూరు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. యూరప్ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపాను బలోపేతం చేయటం, ఇక్కడి ఎన్‌ఆర్‌ఐ సేవలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఎలా వినియోగించుకోబోతుందనే విషయాల గురించి వివరించారు. అలాగే పార్టీలో ఎన్‌ఆర్‌ఐల పాత్రతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని వివరించారు. పార్టీ సభ్యత్వ నమోదులోనూ ఎన్ఆర్‌ఐ తెదేపా ఏ విధంగా పార్టీకి అదనపు బలంగా నిలుస్తుందనే విషయమై చర్చించారు.
డాక్టర్ కిషోర్ బాబు చలసాని మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ఐర్లాండ్ బృందం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి రవి వేమూరికి వివరించారు. యువగళంలో చేస్తున్న వివిధ కార్యక్రమాలు, యూరప్ దేశాలైన ఐర్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, బెల్జియం, స్వీడన్, మాల్టా, ఇటలీ, ఫిన్లాండ్, హంగేరి తదితర వివిధ మిత్ర దేశాలతో సమన్వయం చేసుకుంటూ యువగళం కార్యక్రమానికి, వాలంటీర్లకు ఉడతాభక్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఐర్లాండ్ చేపడుతున్న వివిధ సామాజిక కార్యక్రమాలను గురించి వివరించారు. రాబోయే రోజుల్లో యూరప్‌లోని వివిధ దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ తెదేపాతో కలిసి తాము చేపట్టబోతున్న కార్యక్రమాల గురించి వివరించారు. 2024లో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా అహర్నిశలు కష్టపడతామని సభాముఖంగా వెల్లడించారు. ఐర్లాండ్ బృందం నుంచి కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. ఎన్నికల సమయంలో సాధ్యమైనంత ఎక్కువ మంది ఎన్‌ఆర్‌ఐ తెదేపా సభ్యులు భారత్‌కు వెళ్లి తమ వంతు సాయం చేయాలన్నారు.
కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఐర్లాండ్ తరఫున అధ్యక్షులు భారత్ భాష్యం, ముఖ్య ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు శ్రీనివాస్ పుత్తా, రంగా గల్లా, శివ బాబు వేములపల్లి, అచ్యుత కిషోర్ కొత్తపల్లి, కోటెంద్ర లేళ్ల, విజయ్ కృష్ణ చందోలు, సాయి పవన్ శర్మ, రామ్ వంగవోలు, రామకృష్ణ ఏలూరు, శుభకర రామినేని, జగన్ రెడ్డి ముత్తుముల, వెంకట్రావు, భగత్ సహా యాబై పైగా ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ
-
Samantha: ఆ మూవీ లొకేషన్లో సమంత.. ఫొటోలు వైరల్
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Akhil: కోలీవుడ్ దర్శకుడితో అఖిల్ సినిమా..?
-
Vande Bharat: 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్‌పుర్, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు
-
Purandeswari: ఆర్థిక పరిస్థితిపై బుగ్గన చెప్పినవన్నీ అబద్ధాలే: పురందేశ్వరి