కువైట్‌లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా ...

Published : 28 May 2022 00:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.  అమరులైన నాయకులు, కార్యకర్తలు, ఇతరులకు నేతలు సంతాపసూచికంగా మౌనం పాటించి నివాళులర్పించారని ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు అక్కిలి నాగేంద్ర బాబు తెలిపారు. తెదేపా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్‌సీ, రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చంగల్‌రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

కార్యక్రమంలో చంద్రశేఖర్‌ రాజు, బలరాం నాయుడు, కె. నరసింహ నాయుడు, యనిగల బాలకృష్ణ, సాయి సుబ్బారావు, పార్థసారథి, రత్నం నాయుడు తుమ్మల, ప్రసాద్ పాలేటి, ఆవుల చిన్నయ్య యాదవ్, ఈరాతి శంకరయ్య, శీను, గుండయ్య నాయుడు, పసుపులేటి విజయ్‌కుమార్‌, పసుపులేటి మల్లికార్జున, పసుపులేటి వెంకటరమణ, రాచూరి మోహన్‌ (ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్‌, జాయింట్ సెక్రటరీ), మల్లికార్జున్‌ నాయుడు (ఎన్ఆర్‌ఐ కువైట్ తెలుగు యువత అధ్యక్షుడు), వలసాని శంకర్‌ యాదవ్‌ (ఎన్ఆర్‌ఐ కువైట్‌ బీసీ విభాగం అధ్యక్షుడు), బొమ్ము నరసింహ (ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్ బీసీ విభాగం గౌరవ అధ్యక్షుడు), ఇందు (ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్ మహిళా విభాగం కార్యదర్శి), వెలిగండ్ల శ్రీనివాసరాజు (ఎన్‌ఆర్‌ఐ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి), మురళి నాయుడు (ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్‌ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి), రమేశ్‌ కొల్లపనేని (ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్ తెలుగు యువత ప్రోగ్రాం కోఆర్డినేటర్), జనార్దన్‌ గుండ్లపల్లె (ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్‌ బీసీ ఉపాధ్యక్షుడు), పెంచలయ్య పెరుమాల (ఎన్‌ఆర్‌ఐ తెదేపా కువైట్‌ బీసీ ప్రధాన కార్యదర్శి), కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, సలహాదారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని