అమెరికాలోని బోస్టన్‌లో ఎన్నారై టీడీపీ ‘మహానాడు’కు సర్వం సిద్ధం

తెలుగుదేశం పార్టీ నిర్వహించుకొనే పసుపు పండుగ మహానాడును అమెరికాలోని ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు......

Updated : 21 May 2022 20:28 IST

జయరాం కోమటి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు 

బోస్టన్‌: తెలుగుదేశం పార్టీ నిర్వహించుకొనే పసుపు పండుగ మహానాడును అమెరికాలోని ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. బోస్టన్‌లో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నారై టీడీపీ యూఎస్‌ఏ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ మహానాడును ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించే బోస్టన్‌ మహానాడులో పాల్గొనేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బోస్టన్‌కు చేరుకున్నారు.

మహానాడును బోస్టన్‌లో కనీవినీ ఎగురని రీతిలో నిర్వహించాలని ఇప్పటికే సంకల్పించిన టీడీపీ ఎన్నారై విభాగం నేత జయరాం కోమటి.. ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. బోస్టన్‌లో స్వయంగా ఉండి మరీ ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అతిథులకు అవసరమైన ఏర్పాట్లతో పాటు మహానాడులో చర్చించే అంశాలపై ఆయన ఇప్పటికే సమీక్షించారు. ఏపీలో ఎలాగైతే ఘనంగా నిర్వహిస్తారో.. అంతకన్నా ఘనంగా ఇక్కడ నిర్వహించేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ లైవ్‌లలో ప్రసారానికి కూడా ఏర్పాట్లు చేశారు. 

క‌రోనా నేప‌థ్యంలో గ‌త రెండేళ్లు ఈ మ‌హానాడును వ‌ర్చువ‌ల్‌గానే నిర్వహించాల్సి వచ్చింది. అయితే.. ఈ ఏడాది క‌రోనా తగ్గుముఖం పట్టడంతో పాటు ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు ఉండటంతో పార్టీ అధినేత చంద్రబాబు ఈ ఏడాది మహానాడును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీనికితోడు ఈ ఏడాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు కూడా ప్రారంభం కానుండటంతో మహానాడుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పలు అంశాలపై చర్చించి పార్టీ భవితకు పునాదులు పటిష్టం చేయనున్నారు.  ఇక‌, బోస్టన్‌ జరిగే మహానాడులో పాల్గొనేందుకు ఏపీ నుంచి రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష‌, అనంత‌పురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు మన్నవ సుబ్బారావు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి న‌న్నూరి న‌ర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల  నారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌రులు ఇప్పటికే చేరుకున్నారు.

బోస్టన్‌లో మహానాడు.. లైవ్‌లో వీక్షించండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని