NRI TDP: బే ఏరియా తెదేపా నేతలతో దేవినేని ఉమా భేటీ

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో

Published : 07 Sep 2022 15:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బే ఏరియాలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు. పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. స్థానిక తెదేపా నేత వెంకట్‌ కోగంటి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. 

ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు. వైకాపా ప్రభుత్వం భూకబ్జాలు, ఇసుక, గనుల మాఫియాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యమని తెలిసీ పాలనా వికేంద్రీకరణకు కట్టబడి ఉన్నామంటూ వైకాపా నేతలు అభూత కల్పనలు, అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి గట్టెక్కించే సామర్థ్యం తెదేపా అధినేత చంద్రబాబుకే ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం మేలు కోసం ప్రవాసాంధ్రులు కూడా వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయానికి సహకరించాలని దేవినేని ఉమ కోరారు. తెదేపా మీడియా విభాగం, గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్‌ ఎల్వీఎస్కార్కే ప్రసాద్‌ మాట్లాడుతూ తెదేపా విజయానికి అందరూ కృషి చేయాలన్నారు. తెదేపా నేత భక్త బల్లా వందన సమర్పణ చేశారు.

అనంతరం తెదేపా నేతలు శ్రీకాంత్‌ దొడ్డపనేని, శశి దొప్పలపూడి ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ క్షేత్రాలను నేతలు సందర్శించి రైతులు అవలంబిస్తున్న అధునాతన విధానాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో చంద్ర గుంటుపల్లి, ప్రసాద్‌ మంగిన, భరత్‌ ముప్పిరాల, లీయోన్‌రెడ్డి, సుధీర్‌ ఉన్నం, విజయకృష్ణ గుమ్మడి, శ్రీని వల్లూరిపల్లి, సతీశ్‌ అంబటి, వెంకయ్య జెట్టి, శాస్త్రి వెనిగళ్ల, వీరు ఉప్పల, రమేశ్‌ కొండా, కల్యాణ్‌ కట్టమూరి, వెంకట్‌ అడుసుమిల్లి, సుబ్బా యంత్ర, తిరుపతిరావు, బెజవాడ శ్రీను, వీరబాబు, సూర్య, సందీప్‌ ఇంటూరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని