సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి, తెదేపా మినీ మహానాడు

‘ఎన్‌ఆర్‌ఐ తెదేపా-సౌదీ అరేబియా’ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు, మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు.

Published : 13 May 2023 13:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఎన్‌ఆర్‌ఐ తెదేపా-సౌదీ అరేబియా’ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు, మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా సౌదీ అరేబియా అధ్యక్షుడు ఖాలిద్‌ సైఫుల్లా ఆధ్వర్యంలో ఈనెల 12న డమ్మామ్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్‌ రవికుమార్‌ వేమూరు హాజరయ్యారు. ఏపీఎన్‌ఆర్‌టీ మాజీ ఛైర్మన్‌, ఎన్‌ఆర్‌ఐ తెదేపా గల్ఫ్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖోబర్‌, హస నగరాల నుంచి ఎన్టీఆర్, తెదేపా అభిమానులు హాజరయ్యారు. 

ఈ సందర్భగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ హయాంలో చేపట్టిన పలు సంస్కరణలను గుర్తుచేశారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థల రద్దుతో పాటు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను వివరించారు. ఏపీలో ప్రస్తుత వైకాపా ప్రభుత్వం చేస్తున్న విధ్వంసక పాలన.. మళ్లీ చంద్రబాబును సీఎంగా చేయాల్సిన ఆవశ్యకత గురించి చెప్పారు.  డాక్టర్‌ రవికుమార్‌ వేమూరి మాట్లాడుతూ తెదేపాకు అందరూ అండగా ఉండాలని కోరారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తనతో పాటు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఖాలిద్‌ సైఫుల్లా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా తెదేపా కుటుంబసభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. 

ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా సౌదీ అరేబియా కార్యదర్శి భాస్కర్‌, డమ్మామ్‌ కోఆర్డినేటర్‌ జాకిర్‌ హుస్సేన్‌, నరసింహ, రమణ, సత్య, నరేశ్‌, రావు, ప్రసాద్‌, జాన్సన్‌, విక్టర్‌, సత్యనారాయణ, షేక్‌ అహ్మద్‌, మహ్మద్‌ మాలిక్‌, చాన్‌ బాషా, అబ్దుల్, మజ్రుల్‌, మహ్మద్‌ అజామ్‌, సుబ్రహ్మణ్యం, రాజా ఆగ, సిద్దూక్యూ, హనుమంతరావు, ఇక్బాల్‌, హనుమంత, అబ్దుల్‌ జమీల్‌, సాహిక్‌ అదిల్‌, ముజమీల్‌, కొసరు అలీ, షఫీక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని