పూతలపట్టు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్నారైలు

ఎన్నారై యూకే, యూరోప్ విభాగానికి చెందిన తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల (పూతపట్టు నియోజకవర్గం పోటుకనుమ గ్రామస్థులు), వివేక్ కరియవుల పూతలపట్టు నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

Published : 04 Feb 2023 22:49 IST

యూకే: ఎన్నారై యూకే, యూరోప్ విభాగానికి చెందిన తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల (పూతపట్టు నియోజకవర్గం పోటుకనుమ గ్రామస్థులు), వివేక్ కరియవుల పూతలపట్టు నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ ఇక్కడ చేస్తున్నారు. కొన్ని మండల కేంద్రాల్లో ఫిబ్రవరి 3,4,5 తేదీలలో పార్టీ వాలంటీర్స్‌కి ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరిలో భారీఎత్తున సేవా కార్యక్రమాలు చెయ్యటానికి తమ వంతు సహాయం చేస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు తిత్లీ తుఫాన్‌ సమయంలో, ఉక్రెయిన్‌లో బాధితుల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాలకి వచ్చిన విద్యార్థులకు తోచినంత సాయం చేసి వారికి మంచి ఉద్యోగాలు ఇప్పించటంలో బాగా కృషి చేశారు. 

యూకేలో తెలుగుదేశం కార్యకర్తలకు సోషల్ మీడియా ట్రైనింగ్ ఇచ్చేలా ఒక్కో నియోజకవర్గానికీ ఒక్కో వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం వస్తేనే యువతకి భవిత... లేకపోతే మరో ౩౦ ఏళ్లు వెనక్కి పోతారు అనే నినాదంతో  పార్టీ అభివృద్ధిలో యువతను భాగస్వాములు చేస్తున్నారు. యువ నాయకుడు లోకేశ్‌ ‘యువగళం’  పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ యాత్ర సాగే 400 రోజుల్లో కొన్ని నియోజకవర్గాలలో వివిధ రకాల కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా పార్టీ ప్రజలకు మరింత చేరువై ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. డా. కిషోర్ బాబు చలసాని, కృష్ణ వల్లూరి, శ్రీనివాస్ గోగినేని, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, అమర్నాథ్ పొట్లూరి, వెంకటపతి, ప్రవీణ్ ఉన్నం, ప్రవీణ్ వెలువోలు, కొండయ్య కావూరి, శివ కృష్ణ, సుమంత్ పద్మాల, వివిధ ఎన్నారైలు సభ్యులందరూ ఈ కార్యక్రమాలకు తమ వంతు సహాయం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని