పాతపట్నంలో ఎన్నారై తెదేపా మహిళా విభాగం ‘అన్నా క్యాంటీన్‌’ ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో అన్నా క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు ఎన్నారై తెదేపా మహిళా విభాగం నేతలు. పేదల ఆకలి తీరుస్తోన్న ఈ క్యాంటీన్లు స్థానికుల మన్ననలు అందుకొంటున్నాయి.

Published : 09 Feb 2023 19:23 IST

శ్రీకాకుళం: పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఎన్నారై తెదేపా మహిళా విభాగం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. గత నెల 30న పాత విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ప్రారంభించిన క్యాంటీన్‌ ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తూ స్థానికుల మన్ననలు అందుకుంటోంది. ఇదే స్ఫూర్తితో అతి తక్కువ వ్యవధిలోనే ఎన్నారై మహిళా విభాగం అధ్యక్షురాలు జాగర్లమూడి శివానీ బృందం తాజాగా శ్రీకాకుళం జిల్లా పాత పట్నం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్‌ను ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న తమకు పేదల ఆకలి తీర్చే ఈ కార్యక్రమం ఎంతో తృప్తినిచ్చిందని.. దీన్ని ఎన్నారై మహిళా విభాగం ఎంతో చక్కగా అమలు చేసిందని ప్రశంసించారు. అలాగే, ఈ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్నారై తెదేపా మహిళా విభాగం నిత్యం తమతో మాట్లాడుతూ ఉత్తేజాన్ని, ఉత్సాహ, ధైర్యాన్ని ఇ స్తోందని స్థానిక మహిళలు తెలిపారు. 

ఈ సందర్భంగా పాతపట్నం తెదేపా నియోజకవర్గ బాధ్యులు కలమట వెంకటరమణ మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ఎన్నారైలు ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభించడంపై హర్షం ప్రకటించారు. అలాగే, దీన్ని ఏర్పాటు చేసిన మహిళా ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు శ్రీకాంత్‌ దొడ్డపనేని, గోకుల్‌ రాచిరాజు, కృష్ణ గొంప తదితరులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు