Ramojirao: భారత దేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతార

భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు.

Updated : 18 Jun 2024 20:01 IST

ఆస్టిన్‌: భారతదేశ మీడియా రంగంలో రామోజీరావు ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని పలువురు వక్తలు ప్రశంసించారు. టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో పలువురు పాల్గొన్నారు. ఆయన  ఏ వ్యాపారం చేసినా అందులో సమాజానికి మేలు జరగాలని కోరుకునే వారని రాయపాటి సుబ్రహ్మణ్యం నాయుడు అన్నారు. రామోజీరావు క్రమశిక్షణ, అత్యున్నత ప్రమాణాలు పాటించాలనే ఆయన పట్టుదలను తుమ్మల ఉమాపతి గుర్తు చేసుకున్నారు. పుసులూరి సుమంత్, గూడూరి శ్రీనివాస్, పాతూరి కోటేశ్వరరావు, వేములపల్లి భాను, కొత్త రవి తదితరులు పాల్గొని రామోజీరావు చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని