America: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. బే ఏరియాలో భారీ నిరసన ప్రదర్శన

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అమెరికాలోని బే ఏరియాలో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.

Updated : 17 Sep 2023 21:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అమెరికాలోని బే ఏరియాలో తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళలతో పాటు ఆ రెండు పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

తాము అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నామంటే అదంతా చంద్రబాబు కృషి వల్లే సాధ్యమైందని ప్రవాసాంధ్రులు చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన్ను అరెస్ట్‌ చేశారని.. వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’, ‘వియ్ వాంట్ జస్టిస్‌’, ‘వియ్ ఆర్ విత్ సీబీఎన్’ నినాదాలతో బే ఏరియా వీధులను హోరెత్తించారు. చంద్రబాబును విడుదల చేసే వరకు ఆయనకు అండగా ఉద్యమిస్తామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా, జనసేన స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పలువురు అభినందించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని