డాక్టర్‌ గురవారెడ్డికి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, తెలుగు కళా సమితి ఒమన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 98వ జయంతి కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ వేదికగా...

Updated : 22 Sep 2021 16:08 IST

వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ఘనంగా అక్కినేని జయంతి వేడుకలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, తెలుగు కళా సమితి- ఒమన్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు 98వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు 30 దేశాలకు చెందిన తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని అక్కినేనికి ఘనంగా నివాళులర్పించారు. యూఎస్‌ నుంచి అమెరికా గానకోకిల శారదా ఆకునూరి, భారత్‌ నుంచి కళాబ్రహ్మ శిరోమణి వంశీ రామరాజు, వంశీ, తెలుగు కళాసమితి -ఒమన్ కన్వీనర్ అనిల్‌ కుమార్ కడించర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం 16 గంటల పాటు నిర్విరామంగా కొనసాగింది. ఈ సందర్భంగా సన్‌షైన్‌ ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్‌ గురువారెడ్డికి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వైద్య సేవాశిరోమణి బిరుదును ప్రదానం చేశారు. గురవారెడ్డి కుటుంబ సభ్యులే ఆయనకు ఇంట్లోనే ఘనంగా సత్కరించి అవార్డును బహూకరించడం విశేషం. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కినేని పేరుతో పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. తన కుటుంబ సభ్యులే తనను సత్కరించడం అపూర్వ సన్నివేశమని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటి జమున, సీనియర్‌ దర్శకుడు కె.విశ్వనాథ్, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి, శాంతా బయోటెక్‌ ఛైర్మన్‌ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి,  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, సీనియర్‌ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, దేవులపల్లి మనవరాలు లలితారామ్ (అమెరికా), ఉపేంద్ర చివుకుల (అమెరికా), డాక్టర్‌ మేడసాని మోహన్, డాక్టర్‌ కేవీ కృష్ణకుమారి, సినీ గేయ రచయితలు సుద్ధాల అశోక్ తేజ, భువన చంద్ర, తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, డాక్టర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (అమెరికా), రవి కొండబోలు (అమెరికా), డాక్టర్‌ చిట్టెన్ రాజు వంగూరి (అమెరికా), జయశేఖర్‌ తాళ్లూరి (మాజీ అధ్యక్షుడు -తానా), శిరీష తూముగుంట్ల (కల్చరల్ సెక్రటరీ- తానా), శారదా సింగిరెడ్డి (ఛైర్‌పర్సన్, ఆటా), గురజాడ శ్రీనివాస్ (అమెరికా), డాక్టర్‌ లక్ష్మీప్రసాద్ కపటపు, చిన్నారావు, వేణుగోపాల్‌ హరి, టి.నాగ, బి.కుమార్‌, చైతన్య, సీతారాం, చరణ్‌కుమార్‌, అరుంధతి, రాజశేఖర్‌, ఆనంద్‌, శ్రీదేవి, చైతన్య సూరపనేని, రాణి (తెలుగు కళా సమితి కార్యవర్గం -ఒమన్‌), శారద, అపర్ణ, రాణి, సునీత, లక్ష్మీ కామేశ్వరి (వ్యాఖ్యాతలు-ఒమన్‌), తాతాజీ ఉసిరికల (తెలుగు కళా సమితి, ఖతార్‌), కె.సుధాకర్‌రావు (ఊటాఫ్, కువైట్), వేదమూర్తి (యుఏఈ), సత్యనారాయణ రెడ్డి (ఏకేవీ -ఖతార్), సురేశ్‌ తెలుగు తరంగిణి (యుఏఈ), ప్రదీప్ (యూఏఈ), శివ యెల్లెపు (బహ్రెయిన్‌), వెంకట్ భాగవతుల (ఏకేవీ ఖతార్), దీపిక రావి (సౌదీ అరేబియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రాజేష్ టెక్కలి (అమెరికా), సారథి మోటమర్రి (ఆస్ట్రేలియా), విజయ గొల్లపూడి (ఆస్ట్రేలియా), పార్థసారథి (ఉగాండా), కేఆర్‌ సురేష్ కుమార్ (టాంజానియా), డాక్టర్‌ జీవీఎల్‌ నరసింహం, డా. తెన్నేటి సుధ, శైలజ సుంకరపల్లి, రాధిక నూరి (అమెరికా), సత్యదేవి మల్లుల (మలేషియా), డా. శ్రీరామ్ శొంఠి, శారద పూర్ణ శొంఠి (అమెరికా), సుధ పాలడుగు (అమెరికా), లక్ష్మీ రాయవరపు (కెనడా), గుణసుందరి కొమ్మారెడ్డి (అమెరికా), శ్రీదేవి జాగర్లమూడి (అమెరికా), శ్రీలత మగతల (న్యూజిలాండ్), విజయ్‌కుమార్ పర్రి (స్కాట్లాండ్‌), రవి గుమ్మడవల్లి (ఐర్లాండ్), రాధిక మంగినపూడి (సింగపూర్), రాజేష్ తోలేటి (లండన్), విజయ్‌కుమార్ పర్రి (స్కాట్లాండ్), రవి గుమ్మడవల్లి (ఐర్లాండ్), డాక్టర్‌ తెన్నేటి శ్యాంసుందర్, డాక్టర్‌ తెన్నేటి విజయచంద్ర ఆమని, డాక్టర్‌ జి.సమరం, గుమ్మడి గోపాలకృష్ణ , కామేశ్వరరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు గాయకులు అక్కినేని నటించిన చిత్రాల్లోని పాటలను ఆలపించి అందరినీ అలరించారు. సెప్టెంబర్‌ 20న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని వెంకట్‌ అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని