షార్లెట్‌లో ఎన్టీఆర్ శ‌తజయంతి వేడుకలు

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత సీఎం ఎన్టీఆర్‌ శ‌త‌జయంతి వేడుక‌లు అమెరికాలోని షార్లెట్ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో పార్టీ ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

Published : 30 May 2022 00:37 IST

అమెరికా: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత సీఎం ఎన్టీఆర్‌ శ‌త‌జయంతి వేడుక‌లు అమెరికాలోని షార్లెట్ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో పార్టీ ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. మే 28వ తేదీ నాటికి ఎన్టీఆర్‌ జ‌న్మించి 99 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా శత జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ ఏడాది మొత్తం శ‌త జ‌యంతిని ఘ‌నంగా నిర్వహించాల‌ని నాయకులు నిర్ణయించారు. మే 28, సాయంత్రం 6 గంట‌ల‌కు షార్లెట్‌లోని ప్రొవిడెన్స్ పాయింట్ క్లబ్‌ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎంవీఎస్ఎన్ రాజు, తెదేపా ఎన్నారై విభాగం సమ‌న్వయకర్త జ‌య‌రాం కోమ‌టి పాల్గొన్నారు. ఈ వేడుకలకు  పార్టీ నాయ‌కులు వారి కుటుంబ స‌భ్యుల‌తో సహా వచ్చారు. ఈ కార్యక్రమంలో చందు గొర్రపాటి, బాలాజీ తాతినేని, శ్రీనివాస్ పాల‌డుగు, లోహిత్ న‌న్నపనేని, నాగ పంచుమ‌ర్తి, రంగ‌నాథ్ వీర‌మాచ‌నేని త‌దిత‌రులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి స‌మ‌న్వయకర్తలుగా కిర‌ణ్ గోగినేని(అట్లాంటా), శ్రీనివాస్ (అర్మంద‌) వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ దివ్య స్మృతులను ప్రతిఒక్కరూ స్మరించుకున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెదేపా విజ‌యానికి కృషి చేయాల‌ని తీర్మానం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు