NTR: బే ఏరియా అంగ‌రంగ వైభ‌వంగా ‘ఎన్టీఆర్’ శ‌త‌జ‌యంతి వేడుక‌లు!

అమెరికాలోని బే ఏరియాలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రముఖులలతోపాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.

Updated : 21 May 2023 21:20 IST

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మే 19, శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని శ్రీమతి విజయ ఆసూరి ఎంతో ఉత్సాహంగా నడిపించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేణుగోపాల్‌ ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగువారి వెలుగు దీప్తి ఎన్టీఆర్‌ అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని ఘ‌నంగా నిర్వహించడం ప్రతి తెలుగు వాడికీ గర్వకారణమన్నారు. ఆయన తెలుగు వారిగా జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు. 

ప్రతి కుటుంబానికీ పెద్ద కొడుకు ఎన్టీఆర్‌ : జస్టిస్‌ వేణుగోపాల్‌

తెలుగు వారి వెలుగు దీప్తి ఎన్టీఆర్‌ అని అని తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వేణుగోపాల్‌ అన్నారు. ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుకోవ‌డం, ప్ర‌తి తెలుగు వారికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఎన్టీఆర్‌ తెలుగువారిగా జన్మించడం మ‌నంద‌రికీ గర్వ‌కార‌ణ‌మ‌న్నారు. తెలుగువారిని అవమానిస్తున్న తీరును భరించలేక, వారి ఆత్మగౌరవానికి ప్రతీకను దశ దిశలా చాటుతూ.. ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించి.. కేవలం 9 నెలల వ్యవధిలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని జస్టిస్‌ వేణుగోపాల్‌ అన్నారు.  రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును అమలు చేసి చూపించారని అన్నారు. ప్రతి పేదవాడికీ రూ.2 కే కిలో బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చిన ఘనత అన్నగారికే దక్కిందన్నారు. ఆయన మనిషి రూపంలో జన్మించిన పుణ్యపురుషుడని కొనియాడారు. ‘‘మ‌ద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి తీవ్ర అవ‌మానాలు ఎదుర‌య్యేవి. అలాంటి పరిస్థితిని ఎన్టీఆర్‌ మార్చారు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు తెలుగువారికి  ప్రత్యేక గౌరవం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకే ఆయ‌న్ను ప్రతి కుటుంబం పెద్దకొడుకుగా భావించి ‘ అన్నగారు’ అని పిలుచుకుంటుంది.’’ అని జస్టిస్‌ వేణుగోపాల్‌ అన్నారు. దాదాపుగా ప్రతి తెలుగువారి ఇంట్లో ఎన్టీఆర్‌ ఫొటో ఉంటుందని, అదే ఆయనకు ఇచ్చే గౌరవమని చెప్పారు. మంత్ర ముగ్దుల్ని చేసిన జ‌స్టిస్ వేణుగోపాల్‌ ప్రసంగానికి ప్రేక్షకులు తమ సీట్ల నుండి లేచి కరతాళ ధ్వనులు చేశారు.

ఆత్మగౌరవాన్ని చాటారు: డాక్టర్ నాగేంద్ర ప్రసాద్

ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న దౌత్య కార్యాలయ అధికారి డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ద‌శ‌దిశ‌లా చాటిన మ‌హ‌నీయుడు నంద‌మూరి తార‌క రామారావు అని పేర్కొన్నారు. ఆయ‌న ఎక్కడున్నా తెలుగు వారి కోసం ప‌రిత‌పించార‌ని అన్నారు. తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఇంత‌గా కష్టపడిన వ్యక్తి మరొకరు లేరని తెలిపారు. 

తెలుగు కోసం పరితపించారు: జయరాం కోమటి

తెలుగు నేల కోసం, తెలుగు వారి కోసం ప‌రిత‌పించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఎన్నారై తెదేపా కోఆర్డినేటర్ ‘జ‌య‌రాం కోమ‌టి’ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శ‌తజ‌యంతి వేడుక‌లు చేసుకోవ‌డం అందరి భాగ్యమని అన్నారు. ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు. ‘‘ గత సంవత్సరం మే 28 నుంచి అమెరికాలో ప్రతి నెలా ఒక నగరంలో 12 నగరాలలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.ప్రపంచ వ్యాప్తంగా 100 నగరాల్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఇలా జరగడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి.’’ అని అన్నారు. మిల్పిటాస్ నగర డిప్యూటీ మేయర్ ఎవెలిన్ చువ మే 28వ తేదీని మిల్పిటాస్‌లో ఎన్టీఆర్‌ తేదీగా గుర్తిస్తూ.. జారీ చేసిన పత్రాన్ని అందచేస్తూ ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు.

మిల్పిటాస్ స్కూల్ బోర్డు ట్రస్టీ ‘అను నుక్క’ ప్రసంగించారు. పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు డాలస్ నుంచి జూమ్ ద్వారా మాట్లాడారు.
స్థానిక నాయకులు ‘రమేష్ తంగెళ్లపల్లి’ తను గతంలో పనిచేసిన సమాచార పౌర సంబంధాల శాఖలో వృత్తి రీత్యా అన్నగారి తో న్యూస్ బ్రీఫింగ్, ఆయన సందేశం వీడియో రికార్డింగ్ చేసి ప్రసారం చేయటంలో గల సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకొన్నారు. కళ్యాణ్ వీరపనేని, గోకుల్ రసిరాజు, భక్తా భల్ల తదితరులు ప్రసంగించారు.

ఎన్టీఆర్ అభిమాని అయిన శ్రీకాంత్ దొడ్డపనేని భోజన ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షించారు. స్థానిక తెలుగుదేశం నాయకుడు వెంకట్ కోగంటి అన్ని ఏర్పాట్లను సమన్వయ పరచి, కార్యక్రమం జయప్రదం కావడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో విలేఖ్య వెనిగళ్ళ, కొర్ర జానకి దేవి, చేతన మారిపూరి, నీలిమ గరికపాటి, అన్నపూర్ణ కొర్ర, విజయ్ గుమ్మడి, వీరు వుప్పల, యం వి రావు, సతీష్ చిలుకూరి, తులసి తుమ్మల, ఆది నారాయణ, చంద్ర గుంటుపల్లి, శ్రీనివాస్ వేముల, శాస్త్రి వెనిగళ్ల, రామ్ తోట, ప్రసాద్ మంగిన, రమేష్ కొండా, రవికిరణ్ ఆలేటి, జోగి నాయుడు, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, వెంకట్ జెట్టి, వెంకట్ గొంప, కోటి బాబు కోటిన, భాస్కర్ అన్నే, శ్రీనివాస వల్లూరిపల్లి, హర్ష యడ్లపాటి, లక్ష్మణ్ పరుచూరి, కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, మధు కందేపి, సాయి యనమదల, పాములు నారాయణ, వినయ్ యలమర్తి, భరణి యాతం, రమేష్ నాయుడు, సుభాష్ ఆర్, రవి ఆలపాటి, సురేష్ రెడ్డి ఉయ్యురు, భరత్ ముప్పిరాళ్ళ, చక్రధర్ అనుమోలు, నరహరి మర్నేని తదితరులు పాల్గొన్నారు. తానా ఎన్నికల ప్రచారంలో భాగంగా బే ఏరియాలో ఉన్న నరేన్ కోడలి, రాజా సూరపనేని కూడా హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని