NTR: పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

ఎన్టీఆర్‌ (NTR) శతజయంతి వేడుకలను పోర్ట్‌ల్యాండ్‌లోని (portland) ఓరిగన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానం గురించి వక్తలు వివరించారు.

Published : 27 May 2023 16:31 IST

వాషింగ్టన్‌: పోర్ట్‌ల్యాండ్‌ (Portland) ఒరెగాన్ (Oregon) ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మే 21న ఎన్‌ఆర్‌ఐ తెదేపా (NRI TDP) పోర్ట్‌ల్యాండ్‌ నేతలు, ఎన్టీఆర్‌ అభిమానులు దాదాపు 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘తెలుగువారి ఆత్మగౌరవం’ పేరుతో జరిగిన ఈ వేడుకలో వక్తలు ఆర్‌సీ, ఎన్‌ఆర్‌ఐ తెదేపా పోర్ట్‌లాండ్‌ రీజనల్‌ రిప్రజెంటేటివ్‌ మారుతి, నరహరి తదితరులు ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు.

ఆ తర్వాత జ్యోతి వెలిగించి విగ్రహావిష్కరణ చేసి, ఎన్టీఆర్‌ కీర్తిని కొనియాడారు. సమావేశానికి హాజరైన కొందరు  ఎన్టీఆర్‌ డైలాగ్స్‌ చెబుతూ, ఆయన నటించిన సినిమాల్లోని పాటలకు నృత్యం చేస్తూ అందర్నీ అలరించారు. ‘కథానాయకుడు- మహానాయకుడు’ పేరిట వినీల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్‌ పోటీల్లో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెదేపా తరఫున జూలకంటి బ్రహ్మారెడ్డి, ఆనం వెంకట రమణారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు జూమ్‌ యాప్‌ ద్వారా పాల్గొని తమ సందేశాన్నిచ్చారు. ఖండాంతరాల్లో ఎంతో దూరంగా ఉన్నప్పటికీ.. ఈ వేడుకలు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్టీఆర్‌ రాజకీయాల్లో ఉన్న సమయంలో జాతీయస్థాయిలో తెలుగువారికి ఎలా గుర్తింపు పెరిగిందో వక్తలు చక్కగా వివరించారు. సభా ప్రాంగణాన్ని లక్ష్మీ చైతన్య, రాధిక, లక్ష్మి, ప్రసన్న తదితరులు ఎంతో చక్కగా అలంకరించారు. చివరిగా ఎన్నారై తెదేపా పోర్ట్‌ల్యాండ్‌ అధ్యక్షుడు రవి, మీడియా కోఆర్డినేటర్‌ జితేంద్ర వందన సమర్పణతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవకమిటీ సభ్యులు చంద్ర, సునీల్, ప్రేమ్‌, కోటి, శివ, సురేశ్‌, జి. సురేశ్‌, పి. ప్రతిమ, వెంకట్‌.కె, రాజేంద్ర, జయ ప్రకాశ్‌, అనిల్‌ ,సురేంద్ర, వెంకట్‌.వి, రవి. వి, కిషన్‌ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు