లూయిస్‌విల్లేలో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

శక పురుషుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా అక్కడి తెలుగువారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

Published : 30 May 2023 05:05 IST

అమెరికా: శక పురుషుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా అక్కడి తెలుగువారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రావు కన్నెగంటి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ సాధించిన విజయాలు, ప్రభుత్వ పథకాలు, పాలసీలను గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ తీసుకొచ్చిన పథకాలు ఇప్పటికీ ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో వివరించారు. దేశంలో సామాజిక, రాజకీయ సంస్కరణలకు ఆయన అమలు చేసిన విధానాలు ఎలా పునాది అయ్యాయో చెప్పారు. ఎన్టీఆర్‌ జయంతి వేడుకలకు పలు ప్రాంతాల నుంచి తెలుగువారు వచ్చి తమ ఆలోచనలను పంచుకున్నారు. ఎన్టీఆర్‌ వల్ల తాము ఎలా స్ఫూర్తి పొందామో తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకర మహేంద్ర, నరేశ్‌ బొప్పన, వేణు సబ్బినేని ఇతర ఆర్గనైజర్లు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని