USA: అట్లాంటాలో మే 20న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు.. అతిథులు వీరే

అమెరికాలోని అట్లాంటాలో ఈనెల 20న ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్‌ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈకార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా తెదేపా తెలంగాణ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, తెదేపా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

Published : 14 May 2023 23:53 IST

అమెరికా: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను అమెరికాలోని అట్లాంటా నగరంలో మే 20న  నిర్వహించనున్నారు. ఎన్టీఆర్‌ అభిమానులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా తెదేపా తెలంగాణ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, తెదేపా ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అట్లాంటాలోని డేసన మిడిల్‌ స్కూల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని