లండన్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు లండన్‌లో ఘనంగా జరిగాయి. లండన్‌ తెదేపా ఎన్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో ఈస్ట్‌ లండన్‌లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 01 Jun 2022 00:22 IST

లండన్‌: తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు లండన్‌లో ఘనంగా జరిగాయి. లండన్‌ తెదేపా ఎన్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో ఈస్ట్‌ లండన్‌లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఖండాలు దాటిన తమ అభిమాన నాయకుడిని మార్చిపోమంటూ ఎన్టీఆర్‌ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి తెదేపా మహానాడును ప్రారంభించారు. 

మహానాడు కార్యక్రమం సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌ ప్రజల కోసం చేసిన సేవలు, ఆయన తీసుకొచ్చిన పథకాలు గురించి మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్‌ అండగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా స్వాతి రెడ్డి ప్రవాసాంధ్రులని ఉదేశిస్తూ మాట్లాడారు. సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ పార్టీని ఎలా పటిష్టం చేయాలో చెబుతూ యువతని ప్రోత్సాహపరిచారు. వైకాపా పరిపాలనను అడ్డుకోవడానికి ప్రవాస ఆంధ్రులు పార్టీ కోసం మరింత ఎక్కువగా కష్టపడాలన్నారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటం ఆపొద్దన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది పాటు ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎండగట్టడం, ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి రావటం కోసం ఎలా పని చెయ్యాలి అనే విషయాల మీద చర్చలు జరిపారు. 

అనంతరం జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్‌, జోహార్‌ ఎన్టీఆర్‌ నినాదాల మధ్య కేక్‌ కోశారు. ఈ కార్యక్రమంలో గుంటుపల్లి శ్రీదేవి పాల్గొని జెండా వందనం చేశారు.
సుధీర్ కొత్తపల్లి, నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్యామ్ సుందరరావు ఊట్ల, సజ్జ శ్యామ్, రామకృష్ణ నాయుడు, అనిల్ పచ్చ, జగదీశ్ బండారుపల్లి, మురళీ కృష్ణా ఆరి, శ్రీనివాస్ వళ్లిపల్లి, సాయి కృష్ణ గుర్రం, విజయ్‌ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించారు. 

ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్‌ బాబు, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, పార్టీ సీనియర్ నాయకులు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఊరవకొండ శాసన సభ్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు, కిమిడి నాగార్జున జూమ్‌ కాల్‌ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రశంసించారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, 2024లో తెదేపా విజయం కోసం పనిచెయ్యాలి అని సూచించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు