మెల్‌బోర్న్‌లో అట్టహాసంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

మెల్‌బోర్న్‌ నగరంలో ఎన్టీఆర్‌ శతజయంతి, మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, చిన్న కూతురు తేజస్విని హాజరయ్యారు.

Updated : 06 Jun 2023 22:24 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ఎన్టీఆర్‌ శత జయంతి, మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, చిన్న కూతురు తేజస్విని హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా తెదేపా నాయకులు పులివర్తి నాని, నన్నూరి నర్సిరెడ్డి పాల్గొన్నారు. డోలు బృందంతో అతిథులకు స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక చిత్రాలు లవకుశ, నర్తనశాలలోని పాత్రల ఆధారంగా చిన్నారులు చేసిన నాటక ప్రదర్శన అబ్బురపరచింది. అతిథులు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ నిర్ణయించే రానున్న ఎన్నికల్లో ఎన్నారైలపైనా గురుతర బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.

విక్టోరియా పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం

మెల్‌బోర్న్‌లోని విక్టోరియా రాష్ట్ర పార్లమెంట్‌లో ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నందమూరి వసుంధర దేవి, తేజస్విని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్లమెంట్ లోపల జరిగిన కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ mr.Steve mcghie జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ premierతో అభినందన పత్రాన్ని త్వరలో అందజేస్తామన్నారు. ఎన్టీఆర్ చేపట్టిన గొప్ప పనులను తాము తెలుసుకున్నామన్నారు. మరో ప్రభుత్వ ముఖ్య అధికారి mr. Lee Tarlamis చేతుల మీదుగా వసుంధర గారికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్న సేవలకు గాను పార్లమెంట్ తరుఫున గుర్తింపు పురస్కారాన్ని అందజేశారు. అనంతరం ఎన్ఆర్‌ఐ తెదేపా ఆస్ట్రేలియా సభ్యులు రూపొందించిన జ్ఞాపికలను వసుంధర చేతుల మీదుగా వారికి, పలువురు రాజకీయ నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికార పార్టీ ప్రతినిధులు, ఎంపీలతో పాటు ప్రతిపక్ష ఎంపీలు స్థానిక రాజకీయాల్లో ఉన్న తెలుగువారు కూడా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని