NTR: న్యూజెర్సీలో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామకృష్ణ రాజు, కనకమేడల సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Published : 13 Jul 2023 22:35 IST

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణ రాజు, కనకమేడల రవీంద్రకుమార్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్, తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహన కృష్ణ, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్, భాజపా నాయకుడు పాతూరి నాగభూషణం, ఏపీఎన్నార్టీ (APNRT) మాజీ ఛైర్మన్ వేమూరి రవి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున్న ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ని స్మరించుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మహానటుడిగా, మహానాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాలు, చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆత్మగౌరవ నినాదంతో తెలుగు వారి అభివృద్ధికి, అభ్యున్నతికి ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతూ, అన్ని రంగాల్లో విఫలమవ్వడం వల్ల అభివృద్ధి ఏ విధంగా కుంటుపడుతుందో అందరూ చూస్తున్నారని తెలిపారు.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్వార్థపూరిత రాజకీయ కుట్రల వల్ల వ్యవస్థలు గాడి తప్పుతున్నాయని, వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ఖండిస్తూ ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఎన్నారైలందరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. మన్నవ మోహన కృష్ణ సారథ్యంలో జరిగిన ఈ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వెనిగళ్ల మోహన్ కుమార్, నల్లమల్ల రాధాకృష్ణ, వెనిగళ్ల వంశీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు