USA: పిట్స్‌బర్గ్‌లో ‘ తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్లు’
పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో ‘ తెలుగు ఆత్మగౌరవానికి వందేళ్లు’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు.
పిట్స్‌బర్గ్: పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్ నగరం డిస్కవరీ చర్చి ప్రాంగణంలో ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ‘తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్ళు’ పేరిట వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాదాపు 250 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగువారికి ఎన్టీఆర్ తెచ్చిన గుర్తింపును వక్తలు గుర్తు చేశారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించే క్రమంలో ఆ మార్పును తన సొంత ఇంటి నుంచే ప్రారంభించడం ఎన్టీఆర్ గొప్పతనానికి నిదర్శనమని అక్కడి మహిళలు అభిప్రాయపడ్డారు.
‘సినీ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ వేసిన ప్రతి అడుగూ ఓ సంచలనమే. ఆయన జీవిన విధానం ఎప్పటికి స్ఫూర్తిదాయకమే’ అని గురజాల మాల్యాద్రి, శారదాదేవి పేర్కొన్నారు. ఎన్టీఆర్ చేపట్టిన వినూత్న కార్యక్రమాలను, నిర్ణయాలను, తమ రాజకీయ జీవితాలపై ఆయన ప్రభావం తదితర విషయాలను తెదేపా నేతలు గౌతు శిరీష, గద్దె రామోహన్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఏలూరి సాంబశివరావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, లింగమనేని శివరామప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరాం తమ వీడియో బైట్స్ ద్వారా గుర్తు చేసుకున్నారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకల్లో భాగంగా గత నెల మే నెలలో నిర్వహించిన పురుషుల వాలీబాల్, మహిళల బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ విజేతలకు నిర్వాహకులు ట్రోఫీలతో పాటు నగదు బహుమతిని అందించారు. అమెరికాలో స్ధిరపడి అటు వైద్య రంగంలోను, ఇటు సామాజిక సేవలల్లోనూ విశిష్ట సేవలు అందిస్తున్న డా.కారుమూడి ఆంజనేయులు, అనురాధ దంపతులు, డా.రామన్ పురిగళ్ళలను ఎన్టీఆర్ ట్రస్ట్ పిట్స్‌బర్గ్ సభ్యులు సత్కరించారు. వారు చేస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు తమ వంతుగా ముందుకొచ్చిన స్పాన్సర్లు Avansa IT Solutions, Shineteck Inc., Uniglobal Technologies Inc., Stellium Force Inc., Midsys Inc., Red Chillies, Chutneys, Getitfromnature Arts Academy, Paturi immigration and real estate law, Manpasand spice corner, Spice n Sabzi , mintt restaurant వారికి నిర్వాహకులు వెంకట్ నర్రా, సునీల్ పరుచూరి, హేమంత్ కుమార్ శెట్టి, రవికిరణ్ తుమ్మల, శ్రీహర్ష కలగర, శ్రీ అట్లూరి, రంగరావు తూమాటి, సాయికృష్ణ పాపినేని, సాయి అక్కినేని తదితరులు తమ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన వారికి తెలుగింటి వంటకాలతో పసందైన భోజనాలు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం