బహ్రెయిన్‌లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను బహ్రెయిన్‌లో ఘనంగా నిర్వహించారు.

Published : 30 May 2023 02:44 IST

బహ్రెయిన్‌: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను బహ్రెయిన్‌లో ఘనంగా నిర్వహించారు.  సినీ నటుడు నారా రోహిత్,  గుమ్మడి గోపాలకృష్ణ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెదేపాను గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ బహ్రెయిన్ అధ్యక్షులు రఘునాథ్‌ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వకారణమని కొనియాడారు. శివ కుమార్, శ్రీహరి బాబు,  మురళీకృష్ణ, రాజశేఖర్, గోపాల్ చౌదరి తదితరులు ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వేడుకల్లో సుమారు 500 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు