యూఏఈలో ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి.. పార్టీలకతీతంగా పలువురి నివాళి

దుబాయిలో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్థంతి వేడుకలకు పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని నివాళులర్పించారు. ఆ మహానేత సేవల్ని స్మరించుకున్నారు.

Published : 22 Jan 2023 22:38 IST

దుబాయి: దుబాయిలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యూఏఈ టీడీపీ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వర్థంతి వేడుకలకు పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని ఆ మహా నాయకుడికి నివాళులర్పించారు. యూఏఈ జనసేన, భాజపా నాయకులతో పాటు రాజంపేట మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్, రాప్తాడు నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి ఎద్దల విజయసాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మానవత్వానికి మారుపేరుగా నిలిచే మహా పురుషుడు నందమూరి తారకరామారావు అని విజయసాగర్‌ అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజల్లో గొప్ప మన్ననలు పొందుతున్నాయని.. అతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతి కీర్తి పతాకను ఎగురవేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఎన్టీఆర్‌ కోసమే చరిత్ర ఉందన్నట్టుగా గొప్ప సేవ చేసిన నాయకుడని కీర్తించారు.

ప్రపంచదేశాల్లో ఈ మహానుభావుడిని ఇంతమంది స్మరించుకుంటున్నారంటే ఆయన తెలుగుజాతికి చేసిన విశేష సేవలే కారణమన్నారు. అనంతరం యూఏఈ జనసేన నాయకులూ పాపోలు అప్పారావు , రవికుమార్ సింగిరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గొప్ప మానవతావాది, పేదల పక్షపాతి అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా  పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.  డాక్టర్ తులసి, వాసు, పోటూరి రాజు, రాజా రవికిరణ్, హరి కల్లూరి, సింగయ్య, బాషా తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని