USA: న్యూజెర్సీలో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..
భారతీయ జనతా పార్టీ తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు అమెరికాలోని న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావంలో భాజపా పాత్రను సమావేశానికి హాజరైన వారికి తెలియజేశారు. తెలంగాణ సాధించడంలో ప్రవాస భారతీయులు పోషించిన పాత్రను ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఇతర దేశాల్లో ఉంటున్న తెలంగాణకు చెందిన ప్రతి వ్యక్తీ తమ గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా, విద్యార్థులకు వసతి గృహాలు, బలహీన వర్గాల వారికి గృహాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని రామచంద్రరావు అన్నారు. బంగారు తెలంగాణను సాధించడంలో ప్రవాసులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్-భాజపా (OFBJP) పూర్వ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల మాట్లాడుతూ.. భారత్‌లో ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని, తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను రామచంద్రరావు వివరించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్-భాజపా కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ.. ఓఎఫ్-భాజపా తరపున అమెరికా వ్యాప్తంగా 16 రాష్ట్రాలలో తెలంగాణ కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో మిగతా రాష్ట్రాలలో తెలంగాణ కమిటీలను ఓఎఫ్-భాజపా జాతీయ అధ్యక్షులు అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రకటిస్తామని తెలిపారు.
తెలంగాణ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్-భాజపా వ్యూహాత్మక వ్యవహారాల కో-కన్వీనర్ సంతోష్, శ్రీకాంత్‌లు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరులకు జోహార్లు అర్పిస్తూ సభలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని కోరారు. తెలంగాణ ఓఎఫ్-భాజపా న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్ వంశీ యంజాల, కో-కన్వీనర్ ప్రదీప్ రెడ్డి కట్ట మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు అమెరికాలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి అనుగుల (ఓఎఫ్-భాజపా జాతీయ పూర్వ అధ్యక్షులు), విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ ఓఎఫ్-భాజపా కన్వీనర్), సంతోష్ రెడ్డి (తెలంగాణ ఓఎఫ్-భాజపా వ్యూహాత్మక వ్యవహారాలు కో-కన్వీనర్ ), శ్రీకాంత్ రెడ్డి తుమ్మల (తెలంగాణ ఓఎఫ్-భాజపా అనుసంధాన కో-కన్వీనర్), వంశీ యంజాల (తెలంగాణ ఓఎఫ్-భాజపా న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్), ప్రదీప్ రెడ్డి కట్ట (తెలంగాణ ఓఎఫ్-భాజపా న్యూజెర్సీ ప్రాంతీయ కో-కన్వీనర్), మధుకర్ (తెలంగాణ ఓఎఫ్-భాజపా మీడియా కో-కన్వీనర్ ), తెలంగాణ ఓఎఫ్-భాజపా సీనియర్ కార్యకర్తలు గోపి సముద్రాల , కృష్ణ మోహన్ మూలే , రఘు కనుగో, కమ్యూనిటీ లీడర్స్ శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, రామ్ వేముల, విజయ్ కుందూరు, గోవింద్ రాజ్, ఓంప్రకాష్ నక్క, హేమచందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం