జగన్ పాలనతో ఏపీ ప్రగతి దెబ్బతింది: డెట్రాయిట్‌లో పరిటాల శ్రీరామ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వల్ల రాష్ట్ర ప్రగతి బాగా దెబ్బతిందని తెదేపా యువనేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన డెట్రాయిట్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొని ఉత్తేజకర ప్రసంగం చేశారు.
అమెరికా: తెలుగుదేశం పార్టీ యువ నేత పరిటాల శ్రీరామ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా డెట్రాయిట్‌లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. ఫర్మింగ్టన్‌లోని ‘రావుగారి విందు కుజిన్ బార్ అండ్ బాంక్వెట్’లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెదేపా, పరిటాల అభిమానులతోపాటు దాదాపు 100 మందికిపైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ చేసిన ఉత్తేజకరమైన ప్రసంగం బాగా ఆకట్టుకుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్ర ప్రగతి బాగా దెబ్బతిందని, అధికార పార్టీ నాయకుల అక్రమాలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పరిటాల శ్రీరామ్ విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపునకు ఎన్నారైలు కృషి చేయాలని పరిటాల పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమెరికాకు కొత్తగా వచ్చిన విద్యార్థులతో పాటు డెట్రాయిట్ పరిసర ప్రాంతంలో ఉన్న యువత హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎన్నారై తెదేపా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. రవి గుళ్ళపల్లి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సునీల్ పంట్ర, కిరణ్ దుగ్గిరాల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, రాం ప్రసాద్ చిలుకూరి, ఉమ ఓమ్మి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు. కెనడా నుంచి సుమంత్ సుంకర, అనిల్ లింగమనేని, శ్రీరామ్ కడియాల, కళ్యాణ్‌తోపాటు పలువురు తెదేపా అభిమానులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ