Pawan Kalyan: పవన్ బర్త్‌డే.. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శన
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు, జనసైనికులు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో పవన్ చిత్రమాలికను ఎన్‌ఆర్‌ఐ అభిమానులు ప్రదర్శించారు.
ఇంటర్నెట్‌డెస్క్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు, జనసైనికులు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో పవన్ చిత్రమాలికను ఎన్‌ఆర్‌ఐ అభిమానులు ప్రదర్శించారు. 150 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఉన్న అతిపెద్ద స్క్రీన్‌పై పవన్ చిత్రమాలికను ఎన్‌ఆర్‌ఐలు వీక్షించారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ప్రతి 10 నిమిషాలకు ఓసారి 15 సెకన్ల పాటు ఈ ప్రదర్శన కొనసాగింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు, టీమ్ జనసేన యూఎస్‌ఏ నాయకులు టైమ్ స్క్వేర్ నుంచి పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఎన్‌ఆర్‌ఐ అభిమానులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం జనసైనికులు మాట్లాడుతూ ఏపీ భవిష్యత్‌కు సరైన దిక్సూచి పవన్ అని చెప్పారు. రాబోయేది కీలక సమయమని.. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తమ అభిమాన నటుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
2 నిమిషాల్లోనే 50 మ్యాథ్స్ క్యూబ్‌లు చెప్పేస్తున్న బాలిక..
-
పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
-
స్ట్రాంగ్ రూమ్‌కు రంధ్రం.. నగల దుకాణంలో భారీ చోరీ..
-
బాలినేని X ఆమంచి
-
Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మృతి
-
‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు