చికాగోలో నాట్స్ ఆధ్వర్యంలో తెలుగువారి విహారయాత్ర..!

అమెరికాలో తెలుగుజాతిని ఏకంచేసేందుకు ఏర్పడిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’.. అజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా చికాగోలో తెలుగువారితో విహారయాత్ర ఏర్పాటు చేసింది.........

Published : 31 Aug 2022 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో తెలుగుజాతిని ఏకం చేసేందుకు ఏర్పడిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’.. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా చికాగోలో తెలుగువారితో విహారయాత్ర ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పాటైన చాప్టర్ కో-ఆర్డినేటర్ హరీశ్ జమ్ముల నేతృత్వంలో 200 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఈ విహారయాత్రలో పాల్గొన్నాయి. ఉద్యానవనంలో పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహాంగా ఆటపాటలతో అమృతోత్సవ సంబురాలు చేసుకున్నారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ఇమిటేషన్ రాజు నవ్వులు పూయించారు. డీజే సందీప్ సినిమా పాటల ప్రదర్శన అందరిలోనూ ఉత్సాహం నింపింది. హరీశ్ జమ్ముల నేతృత్వంలో బిందు వీధులమూడి, వీర తక్కెళ్లపాటి, భారతి పుట్ట, రోజా శీలంశెట్టి, నరేంద్ర కడియాల, కార్తీక్ మోదుకూరి రాజయ్య వినయ్‌ తమ ప్రణాళికతో ఈ విహార యాత్రను విజయవంతం చేశారు.

చికాగో నుంచి నాట్స్ ఈసీ నాయకులు మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె బాలినేని, లక్ష్మి బొజ్జా ఈ విహార యాత్ర దిగ్విజయమయ్యేందుకు సహకరించారు. చికాగో నుంచి మద్దతు అందించిన మూర్తి కొప్పాక, శ్రీను అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం తదితరులకు నాట్స్ బోర్డ్ ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ చికాగో చాప్టర్ వాలంటీర్లు వేణు కృష్ణార్దుల, శ్రీనివాస్ పిడికిటి, మహేష్ కాకరాల, లేఖ నిమ్మగడ్డ, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ బొజ్జా, శిల్పా యర్రా, రాధిక కోగంటి, సుమతి నెప్పలి, నరేశ్ యాడ, సాంబశివరావు, అరుష్ నిమ్మగడ్డ, వర్షిత్ తక్కెళ్లపాటి, సంకేత్, రాజేశ్ వీధులమూడి ఈ విహారయాత్ర విజయవంతానికి  తమవంతు పాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు